Nagababu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై మెగాబ్రదర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:05 PM

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ ప్రసాదాన్ని జంతు కొవ్వుతో, చేప నూనెతో కల్తీ చేసి కోట్లమంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం అని అన్నారు మెగాబ్రదర్ నాగబాబు. ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా ఆయన తిరుమల లడ్డు కాంట్రవర్సీపై సంచలన కామెంట్స్ చేశారు.

Mega Brother Nagababu

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ ప్రసాదాన్ని జంతు కొవ్వుతో, చేప నూనెతో కల్తీ చేసి కోట్లమంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం అని అన్నారు మెగాబ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu). ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా ఆయన తిరుమల లడ్డు కాంట్రవర్సీపై సంచలన కామెంట్స్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గల పుణ్యక్షేత్రంలోని లడ్డు ప్రసాదాన్ని నాలుగు రాళ్లు మిగుల్చుకోవాలనే దురుద్దేశంతో జంతు కొవ్వు సైతం వెయ్యడానికి వెనకాడని ఇలాంటి ద్రోహుల్ని క్షమించకూడదని నాగబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం తిరుమల లడ్డు కాంట్రవర్సీ దేశ రాజకీయాల్లో సైతం హాట్ టాపిక్‌గా మారింది. తిరుమల స్వామి లడ్డూ ప్రసాదం కలుషితం అయినట్టు నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంపై తీవ్రంగానే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం ఫోన్‌ చేసి.. ఈ వ్యవహారంపై పూర్తి నివేదికను తనకు పంపాలని కోరారు. భారత ప్రభుత్వ ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీ నిబంధనలకు అనుగుణంగా కూడా చర్యలు తీసుకుంటామని నడ్డా చెప్పడంతో.. ఏపీ ప్రభుత్వం పూర్తి నివేదికను నడ్డాకు పంపేందుకు సమాయత్తమవుతోంది. (Tirumala Laddoo Controversy)

Also Read- Balayya-Venky: వెంకీ మామ సినిమా సెట్స్‌లో ‘భగవంత్ కేసరి’ సందడి


Tirumala-Laddu.jpg

నాగబాబు ట్వీట్‌లో ఏం అన్నారంటే..

‘‘ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ ప్రసాదాన్ని జంతు కొవ్వుతో, చేప నూనెతో కల్తీ చేసి కోట్లమంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం..

‘పాపం చేసి కోట్లు కూడగట్టుకున్నాం అనుకున్నారు కాని కోట్ల మంది హిందువుల గోడు కూడగట్టుకున్నారు అని గుర్తించలేకపోయారు’

ఒక వ్యక్తి ఒక మతాన్ని స్వీకరించి ఆ దేవున్ని నిష్టతో పూజించి ఆ దేవుడికి ప్రసాదం అర్పించడం జరుగుతుంది తదుపరి ఆ ప్రసాదాన్ని భుజిస్తే ఆ దేవుడే వారితో మమేకమైనట్టు నమ్ముతారు, అంతటి విశిష్టతమైన ప్రసాదాన్ని అందులోను తిరుమల వంటి ప్రపంచ ప్రఖ్యాత గల పుణ్యక్షేత్రంలోని లడ్డు ప్రసాదాన్ని నాలుగు రాళ్లు మిగుల్చుకోవాలనే దురుద్దేశంతో జంతు కొవ్వు సైతం వెయ్యడానికి వెనకాడని ఇలాంటి ద్రోహుల్ని క్షమించకూడదు, అందుకే తితిదే లాంటి శాఖలలో హిందుత్వాన్ని ఆచరించే వారుంటేనే ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు పునరావృతం అవ్వవని నమ్ముతూ ఈ హేయమైన చర్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను..’’ అని మెగా బ్రదర్ నాగబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read- Tirupati Controversy: ల‌డ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ కౌంటర్

Also Read- ANR100: ఏఎన్నార్‌ను స్మరించుకున్న చిరు, బాలయ్య

Also Read- Jani Master: నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్.. రిమాండ్ రిపోర్ట్ ఇదే

Read Latest Cinema News

Updated Date - Sep 21 , 2024 | 12:05 PM