Shahbano: మాల్వి మల్హోత్రా ‘షాబానో’ స్పెషల్ ఇదే..

ABN , Publish Date - Jul 13 , 2024 | 08:43 PM

ఆడు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హీరోయిన్ మాల్వి మల్హోత్రా నర్తించిన స్పెషల్ సాంగ్ ‘షాబానో’ డివో మ్యూజిక్ ద్వారా తాజాగా విడుదలైంది. గౌతమ్ చవాన్ నిర్మాతగా భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సాంగ్‌కు యష్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. సాంగ్ విడుదలైన తర్వాత యువత నుండి మంచి స్పందన లభిస్తోందని వీడియో సాంగ్ మేకర్స్ చెబుతున్నారు.

Malvi Malhotra

ఆడు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హీరోయిన్ మాల్వి మల్హోత్రా (Malvi Malhotra) నర్తించిన స్పెషల్ సాంగ్ ‘షాబానో’ (Shahbano) డివో మ్యూజిక్ ద్వారా తాజాగా విడుదలైంది. గౌతమ్ చవాన్ నిర్మాతగా భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సాంగ్‌కు యష్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. సాంగ్ విడుదలైన తర్వాత యువత నుండి మంచి స్పందన లభిస్తోందని వీడియో సాంగ్ మేకర్స్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో సాంగ్ వైరల్ అవ్వడమే కాకుండా యంగ్ స్టర్స్ రీల్స్ చేస్తూ ఉండడం విశేషం. అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ సాంగ్ మెలోడిగా క్యాచీ లిరిక్స్‌తో ఆకట్టుకుంటోంది.

టాలెంటెడ్ సింగర్ సాకేత్ కోమండూరి (Saketh Komanduri) ఈ సాంగ్‌కు తనదైన శైలిలో సంగీతం అందించారు. ఏ.డి మార్గల్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సాంగ్‌కు శ్రీకాంత్ పట్నాయక్ ఆర్ ఎడిటర్.. అలాగే ఆర్.మురళీమోహన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆర్. చంద్రమోహన్ ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ‘షాబానో’ సాంగ్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైంది. అన్ని భాషల్లో ఈ సాంగ్‌ను సోని కోమండూరి పాడడం విశేషం. సోని కోమండూరి ‘బాహుబలి’ సినిమాలో ‘హంసనావ’ పాట పాడిన విషయం తెలిసిందే.


Shahbano-Team.jpg

మాల్వి మల్హోత్రా (Heroine Malvi Malhotra) విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె రాజ్ తరుణ్ సరసన నటించిన ‘తిరగబడరసామి’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే రాజ్ తరుణ్, లావణ్యల కేసులో కూడా మాల్వి మల్హోత్రా పేరు బాగా వినబడుతోంది. అలాగే ఇప్పుడీ పాట కూడా ఆమెను ట్రెండింగ్‌లో ఉండేలా చేస్తోంది.

Updated Date - Jul 13 , 2024 | 08:43 PM