ఫహాద్‌పై సుమోటో కేసు
ABN , Publish Date - Jun 30 , 2024 | 06:43 AM
మలయాళ నటుడు, నిర్మాత ఫహాద్ ఫాజిల్‌పై కేరళ మానవ హక్కుల సంఘం సుమోటో కేసు నమోదు చేసింది. దీనిక్కారణం ఆయన నిర్మిస్తున్న ‘పింకేలీ’ సినిమా షూటింగ్.
మలయాళ నటుడు, నిర్మాత ఫహాద్ ఫాజిల్‌పై కేరళ మానవ హక్కుల సంఘం సుమోటో కేసు నమోదు చేసింది. దీనిక్కారణం ఆయన నిర్మిస్తున్న ‘పింకేలీ’ సినిమా షూటింగ్. అంగమలైలోని ఎర్నాకులం ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం రాత్రంతా ఈ సినిమా కోసం షూటింగు చేయడంతో అక్కడున్న రోగులంతా ఇబ్బంది పడ్డారు. ఆస్పత్రి లోపలికి ఎవరినీ అనుమతించకుండా అత్యవసర విభాగం అనుమతి తీసుకోకుండా షూటింగ్ చేశారనేది ఆరోపణ. దీనిపై ఎర్నాకులం జిల్లా వైద్యాధికారి బీనా కుమారి సీరియస్ అయ్యారు. ఏడు రోజుల్లో ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న కేరళ మానవ హక్కుల సంఘం నిర్మాత ఫహాద్‌పై కేసు నమోదు చేసింది.