లావణ్యే డ్రగ్స్‌ అలవాటు చేసింది

ABN , Publish Date - Aug 04 , 2024 | 03:51 AM

రాజ్‌తరుణ్‌, ఆయన మాజీ ప్రియురాలు లావణ్య మధ్య నడుస్తున్న వివాదం కొత్త మలుపు తీసుకుంది. లావణ్య తనకు డ్రగ్స్‌ అలవాటు చేసిందంటూ ప్రీతీ అనే యువతి నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో...

  • రాజ్‌తరుణ్‌ మాజీ ప్రియురాలిపై కేసు

రాజ్‌తరుణ్‌, ఆయన మాజీ ప్రియురాలు లావణ్య మధ్య నడుస్తున్న వివాదం కొత్త మలుపు తీసుకుంది. లావణ్య తనకు డ్రగ్స్‌ అలవాటు చేసిందంటూ ప్రీతీ అనే యువతి నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. ‘లావణ్య ఇప్పటికే చాలామంది అమ్మాయిలకు డ్రగ్స్‌ అలవాటు చేసింది, తరచూ నాకు ఫోన్‌చేసి బెదిరిస్తోంది, ఆమెవల్ల ఇప్పటి కే చాలా జీవితాలు నాశనం అయ్యాయి’ అని ప్రీతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుపుతున ్నట్లు ఎస్సై సుఖేంద ర్‌రెడ్డి తెలిపారు. డ్రగ్స్‌ విషయంలో అడ్డు చెప్పడం వల్లే ఆమె రాజ్‌తరుణ్‌పై కక్ష పెంచుకుందని ఆయన తరపు లాయర్‌ మధుశర్మ చెప్పారు.

Updated Date - Aug 04 , 2024 | 08:29 AM