King Nagarjuna: రూ. 100 కోట్లకు మరో దావా వేస్తా.. తగ్గేదే లేదు

ABN , Publish Date - Oct 05 , 2024 | 08:58 AM

తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ తన ఫ్యామిలీ‌పై చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై కింగ్ నాగార్జున అస్సలు తగ్గనంటున్నారు. ఆమె క్షమాపణ చెప్పినా సరే.. తగ్గేదే లేదు అన్నట్లుగా ఆయన మూవ్ అవుతున్నారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పొలిటికల్ లీడర్స్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాలు తెలియాలంటే..

King Nagarjuna

తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ (Konda Surekha) తన ఫ్యామిలీ‌పై చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై కింగ్ నాగార్జున (King Nagarjuna) అస్సలు తగ్గనంటున్నారు. ఆమె క్షమాపణ చెప్పినా సరే.. తగ్గేదే లేదు అన్నట్లుగా ఆయన మూవ్ అవుతున్నారు. తాజాగా ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొండా సురేఖపై కేసు ఫైల్ చేయించిన నాగార్జున ఇప్పుడు ఆమెపై రూ. 100 కోట్లకు మరో దావా వేస్తా నంటూ సంచలన కామెంట్స్ చేశారు.

Also Read- Rajendra Prasad: నటుడు రాజేంద్రప్రసాద్‌ కుమార్తె మృతి.. విషయం ఏమిటంటే

‘‘కొండా సురేఖ క్షమాపణ చెప్పినా తగ్గేదే లేదు. ఆమెపై పరువు నష్టం దావాను ఉపసంహరించుకోను. రూ. 100 కోట్లకు మరో దావా వేస్తా. ఆమె సమంతకు క్షమాపణలు చెబితే సరిపోతుందా? మరి నా కుటుంబం సంగతేమిటి?’’ అంటూ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా నాగార్జున ఈ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే..

Also Read- Nagarjuna: ఆ రోజు ఇండస్ట్రీని పట్టించుకోలేదు.. ఈ రోజు నీ వెంటే ఇండస్ట్రీ.. తేడా తెలిసిందా నాగ్

‘‘తనపైన, తన కుటుంబంపైన అసత్య ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై రూ.100 కోట్లకు మరో పరువు నష్టం దావా వేసే ప్రక్రియలో ఉన్నట్టు నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) చెప్పారు. ఆమె తమకు క్షమాపణలు చెప్పినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. ఇప్పటికే ఆమెపై వేసిన క్రిమినల్‌ పరువు నష్టం దావాను ఉపసంహరించుకోబోమని తేల్చిచెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని ఆమె చెబుతున్నారు. సమంతకు క్షమాపణ కూడా చెప్పారు. మరి.. తన కుటుంబం సంగతేమిటి? తనకూ, తన కుటుంబానికి క్షమాపణ చెప్పరా?’’ అని ఈ వ్యవహారంపై ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.


King-Nag.jpg

ఒకవేళ ఆమె క్షమాపణలు చెప్తే.. ఇప్పటికే వేసిన దావాను ఉపసంహరించుకుంటారా అని ప్రశ్నించగా.. ‘‘ అస్సలు ఆ పని జరగదని స్పష్టం చేశారు. ఇకపై ఇది వ్యక్తిగత అంశం కాదని.. ఆమె చేసిన దారుణమైన ఆరోపణలు తనను, తన కుటుంబాన్ని దాటి వెళ్లాయని పేర్కొన్నారు. ఈ విషయంలో తమకు యావత్‌ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి లభిస్తున్న మద్దతుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వ్యవస్థ లోలోతులకు విస్తరించిన తెగులును అరికట్టే ప్రక్రియలో తాము ఉన్నామన్న విషయాన్ని తనకు అర్థమయ్యేలా చేసిందని వ్యాఖ్యానించారు.

‘‘వారి వారి రాజకీయ ప్రయోజనాల కోసం మా పేర్లను ఉపయోగించుకోవడం దారుణం. వినోద రంగంలో ఉన్న మేము ఇకపై తేలికైన లక్ష్యాలుగా ఉండబోము. ఆమెపై చట్టపరంగా మేం తీసుకునే చర్యలు.. ఇతర రాజకీయ నేతలకు ఒక హెచ్చరికగా ఉంటాయి. మాలాంటి వారికి అపకీర్తి కలిగించే వ్యాఖ్యలు చేయకుండా వారిని నిరోధిస్తాయని తాను భావిస్తున్నట్టు నాగార్జున తెలిపారు. తమకు సత్వర న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది తనకు ఒకదాని వెనుక ఒకటిగా సమస్యలు వస్తున్నాయన్న మాట నిజమేని ఒప్పుకొన్న నాగార్జున.. అయినా ఇబ్బంది లేదని.. తానొక బలమైన వ్యక్తినని.. తన కుటుంబాన్ని రక్షించుకునే విషయంలో సింహంలా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ మొత్తం తమకు మద్దతుగా వచ్చిందని.. తన తండ్రికున్న గౌరవం, ఆయన ఆశీస్సులే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. కాగా.. నాంపల్లి కోర్టులో నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్‌ పరువునష్టం దావా కేసు శుక్రవారం విచారణకు రావాల్సి ఉంది. కానీ, న్యాయమూర్తి సెలవులో ఉండడంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది.

Also Read- Prakash Raj: పవన్ కళ్యాణ్‌పై మరో ట్వీట్ పేల్చిన ప్రకాశ్ రాజ్..

Also Read- Thalapathy 69: విజయ్ లాస్ట్ సినిమా ఓపెనింగ్‌లో ఏం జరిగిందో తెలుసా?

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 05 , 2024 | 08:58 AM