NTR Film Awards: కళావేదిక, రాఘవి మీడియా వారి ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు అంతా సిద్ధం

ABN , Publish Date - Jun 28 , 2024 | 10:25 PM

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి తారకరామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటీ నటులకు ‘కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024’ హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో శనివారం (జూన్ 29)న జరగబోతోంది. కళావేదిక R.V.రమణ మూర్తి, రాఘవి మీడియా ఆధ్వర్యంలో వైభవంగా ఈ వేడుక ముస్తాబైంది.

NTR Film Awards: కళావేదిక, రాఘవి మీడియా వారి ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు అంతా సిద్ధం
Kalavedika NTR Film Awards 2024

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి తారకరామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటీ నటులకు ‘కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024’ హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో శనివారం (జూన్ 29)న జరగబోతోంది. కళావేదిక R.V.రమణ మూర్తి, రాఘవి మీడియా ఆధ్వర్యంలో వైభవంగా ఈ వేడుక ముస్తాబైంది.

ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుగా పోస్టర్ లాంచ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీద జరిగింది. ఈ అవార్డుల వేడుకకు విశిష్ట అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో నారా రోహిత్, హీరోయిన్ అనన్య నాగళ్ళ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మరియు మరికొంతమంది ప్రముఖులు హాజరుకానున్నారు.


Nara-Rohith.jpg

ఈ సందర్భంగా కళావేదిక భువన మరియు రాఘవి మీడియా మధు మాట్లాడుతూ.. విశ్వవిఖ్యాత, పద్మశ్రీ డాక్టర్. నందమూరి తారక రామారావు పేరు మీద అవార్డ్స్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. వేడుకకి ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి, తెలంగాణ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, దనసరి అనసూయ (సీతక్క)కి, దర్శకులు బోయపాటి శ్రీనుకి, హీరో నారా రోహిత్‌కి, రాహుల్ సిప్లిగంజ్‌కి, హీరోయిన్ అనన్య నాగళ్ళకి, మరియు మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ నెల 29న సినీ ప్రముఖులు, NTR గారి అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాము.

Updated Date - Jun 30 , 2024 | 06:34 PM