‘బాలస్వామిని బంగారు అయ్యప్పా’ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్
ABN , Publish Date - Dec 31 , 2024 | 05:04 PM
‘బాలస్వామిని బంగారు అయ్యప్పా’ పాట ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకోవడంతో.. ఆ పాట యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించింది. ఈ వేడుకకు యాక్టర్ జెడి చక్రవర్తి హాజరై.. యూనిట్‌ను అభినందిస్తూ.. జ్ఞాపికలను అందజేశారు.
RRR ప్రొడక్షన్స్ నిర్మాణంలో నిర్మితమైన ‘బాలస్వామిని బంగారు అయ్యప్పా’ పాట ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోంది. నక్షత్ర స్టూడియో ద్వారా రిలీజ్ అయిన ఈ పాట సోషల్ మీడియాలో 25 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా నక్షత్ర మీడియా ఛైర్మన్ రాజశేఖర్.. ఆ పాట రాసిన పరమేశ్‌కి, పాట పాడిన చిన్నారి తన్వికి, సంగీత దర్శకుడు సత్యదీప్‌కి, కొరియోగ్రాఫర్ హరికాంత్ రెడ్డికి, అలాగే ఆ పాటకు నృత్యం చేసిన చిన్నారులకు ఆస్ బెస్టాస్ కాలనీలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో చిరుసత్కారం ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు మాన్లీ స్టార్ జె.డి.చక్రవర్తి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
Also Read-Kannappa Heroine: ‘కన్నప్ప’ హీరోయిన్.. కత్తిలా ఉంది
ఈ సందర్భంగా జె.డి. చక్రవర్తి నక్షత్ర టీమ్ యూనిట్‌ను మెచ్చుకుంటూ.. పాటను రూపొందించిన టీమ్‌కు, మిగతా టెక్నిషియన్స్ అందరినీ జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇలా మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ఎంకరేజ్ చేస్తూ వారికంటూ ఓ ప్లాట్ పామ్ క్రియేట్ చేసినందుకు నక్షత్ర మీడియా అధినేత రాజశేఖర్‌కు, యాంకర్ గంగకు మనస్ఫుర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. అలాగే ఈ పాటను ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.