Jailer Villain: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ‘జైలర్’ విలన్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ABN , Publish Date - Sep 07 , 2024 | 10:10 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ‘జైలర్’ సినిమా విలన్ వినాయకన్‌ను పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ని వినాయకన్ కొట్టినట్టు తెలుస్తోంది. ఆ కారణంతో పోలీసులు వినాయకన్‌ను అరెస్ట్ చేశారని సమాచారం.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ‘జైలర్’ సినిమా విలన్ (Jailer Villain) వినాయకన్ (Vinayakan)ను పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ని వినాయకన్ కొట్టినట్టు తెలుస్తోంది. ఆ కారణంతో పోలీసులు వినాయకన్‌ను అరెస్ట్ చేశారని సమాచారం. ‘జైలర్’ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth)తో పాటు విలన్ వర్మగా చేసిన వినాయకన్ కూడా తన నటనతో అందరినీ అలరించారు. సినిమా విజయానికి తను కూడా ఓ కారణమయ్యారు. కానీ, రియల్ లైఫ్‌లో కూడా వినాయకన్.. వర్మ పాత్రలానే బిహేవ్ చేయడంతో విమర్శలపాలవక తప్పడం లేదు. స్వతహాగా మళయాళ సినీ పరిశ్రమలో ఎక్కువ సినిమాలు చేసిన వినాయకన్.. రజినీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలో వర్మ పాత్రతో పాపులర్ అయ్యాడు. ఇక వినాయకన్ అరెస్ట్ విషయానికి వస్తే..
Also Read- Vijayawada Floods: మెగా డాటర్ నిహారిక సంచలన నిర్ణయం
మద్యం మత్తులో ఉన్న వినాయకన్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో (Shamshabad RGI Airport) కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు ఫిర్యాదు అందడంతో.. వినాయకన్‌ను అదుపులోకి తీసుకొని ఆర్.జి.ఐ పోలీసులకు సీఐఎస్ఎఫ్ అప్పగించినట్టు తెలుస్తోంది. మరోపక్క మద్యం మత్తులో ఉండి తమపై దాడి చేశారని అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. కొచ్చిన్‌లో సినిమా షూటింగ్ ముగించుకుని గోవా కనెక్టింగ్ ఫ్లైట్ కోసం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో వెయిటింగ్‌లో ఉన్న సమయంలో వినాయకన్ దాడి చేసినట్టు చెబుతున్నారు. వినాయకన్ ప్రస్తుతానికి గోవాలో సెటిల్ అయినట్టు తెలుస్తోంది. వినాయకన్‌ను అదుపులోకి తీసుకుని ఆర్జిఐ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీంతో వినాయకన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. మరోసారి అనడానికి కారణం ఏంటంటే.. గత ఏడాది అక్టోబర్ 23న కూడా దురుసు ప్రవర్తనతో వినాయకన్ అరెస్ట్ అయ్యాడు.
Also Read- Game Changer: అభిమానుల నిరీక్షణ ఫలించింది.. అదిరిపోయే పోస్టర్‌తో అప్డేట్
Read Latest Cinema News