త్వరలోనే మీ ముందుకొస్తా
ABN , Publish Date - Jul 18 , 2024 | 12:41 AM
నటించిన అతికొద్ది చిత్రాలతోనే తన సూపర్ యాక్టింగ్‌తో.. మంచి టైమింగ్‌తో నటుడిగా స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నారు నవీన్ పొలిశెట్టి. 2023లో విడుదలైన ‘మిస్.శెట్టి, మిస్టర్ పొలిశెట్టి’ చిత్రం తర్వాత ఆయన తెరపై కనిపించలేదు...
నటించిన అతికొద్ది చిత్రాలతోనే తన సూపర్ యాక్టింగ్‌తో.. మంచి టైమింగ్‌తో నటుడిగా స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నారు నవీన్ పొలిశెట్టి. 2023లో విడుదలైన ‘మిస్.శెట్టి, మిస్టర్ పొలిశెట్టి’ చిత్రం తర్వాత ఆయన తెరపై కనిపించలేదు. ఈ విరామానికి గల కారణాన్ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘‘నేను మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను చేస్తున్న సినిమాల గురించి అప్డేట్స్ లేవని అందరూ అడుగుతున్నారు. దానికి కారణం ఇటీవలే జరిగిన బైక్ ప్రమాదంలో నా చేతికి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ గాయాల వల్లే నేను సినిమాలను అనుకున్న టైమ్‌కి మీ ముందుకు తీసుకురాలేకపోతున్నాను. ఈ విరామానికి నన్ను క్షమించండి. త్వరలోనే పూర్తిగా కోలుకుని మిమ్మల్ని తిరిగి ఎంటర్టైన్ చేస్తాను’’ అని పేర్కొన్నారు.