Hunger: గోపాల్ బోడేపల్లి ‘హంగర్’కు అంతర్జాతీయ గుర్తింపు.. అవార్డుల పంట‌

ABN , Publish Date - Jul 12 , 2024 | 11:28 AM

గోపాల్ బోడేపల్లి నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన హంగర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయి. తాజాగా ఇంటర్నేషనల్ న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో హానరబుల్ మెన్షన్ అవార్డుని గెల్చుకుంది.

Hunger

కొందరు సినిమాల‌ను డబ్బుల కోసం తీస్తారు.. ఇంకొందరు అవార్డుల కోసం తీస్తుంటారు.. మరికొందరు ప్యాషన్ ‌కోసం సినిమాలు చేస్తుంటారు. అలా సినిమాల మీద ఇష్టం, ప్యాషన్‌తో చేసే వారికి అవార్డులు, రివార్డులు వస్తుంటాయి. ఈక్రమంలోనే న్యూయార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్న గోపాల బోడేపల్లి (Gopala Boddepalli) తన ప్యాషన్‌తో తీస్తున్న చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా పేరు వస్తోంది.

Hunger

గోపాల్ బోడేపల్లి (Gopala Boddepalli) నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన హంగర్ (Hunger) సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ (New York Film Festival) లో హానరబుల్ మెన్షన్ అవార్డుని గెల్చుకుంది. అంతే కాకుండా ఈ చిత్రం ప్యారిస్, లండన్ ఉత్సవాలతో పాటు మరో 10 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులను గెల్చుకుంది.


గోపాల్‌ డైరెక్షన్‌లో ఇంతకు ముందు వచ్చిన ‘మరణం’ (Maranam)షార్ట్ ఫిల్మ్ కూడా 34 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డు గెల్చుకుంది. ఇదిలాఉండ‌గా ఇప్పుడు ఈ రెండు చిత్రాలు దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అఫీషియల్ సెలక్షన్‌కి ఎంపిక అయ్యాయి.

Hunger.jpg

Updated Date - Jul 12 , 2024 | 11:28 AM