Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతికి మొగల్తూరులో ఏం చేస్తున్నారంటే..
ABN , Publish Date - Jan 19 , 2024 | 09:47 AM
రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి, స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి వేడుకలు ఈ నెల 20వ తేదీన మొగల్తూరులో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, కూతురు ప్రసీద, ప్రభాస్ ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ అందే బాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబోతున్నారు.
రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి, స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebel Star Krishnam Raju) జయంతి వేడుకలు ఈ నెల 20వ తేదీన మొగల్తూరు (Mogultur)లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి (Shyamala Devi Uppalapati), కూతురు ప్రసీద (Praseedha), ప్రభాస్ (Prabhas) ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ అందే బాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబోతున్నారు. ఈ వైద్య శిబిరం కృష్ణం రాజు, డాక్టర్ వేణు కవర్తపు (Venu Kavarthapu) ట్రస్టీలుగా ఉన్న యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ వైద్య శిబిరంలో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి నుంచి డాక్టర్ శేషబత్తారు, భీమవరంలోని వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి డా.వర్మ పాల్గొననున్నారు.
ఈ ఉచిత వైద్య శిబిరంలో డయాబెటిస్‌తో బాధపడుతున్న స్థానిక ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మెడిసిన్స్, చికిత్స అందిస్తారని శ్యామలాదేవి తెలిపారు. మొగల్తూరుతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరం సేవలను ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. ఈ వైద్య శిబిరానికి సంబంధించిన వివరాలతో ఓ పోస్టర్‌ని ఆమె విడుదల చేశారు. (Free Medical Camp in Mogultur)
ఈ సందర్భంగా శ్యామలాదేవి (Shyamala Devi) మాట్లాడుతూ.. కృష్ణం రాజుగారి జయంతి వేడుకలను ఆయనకు ఎంతో ఇష్టమైన మొగల్తూరులో చేస్తున్నాం. ఈ సందర్భంగా శ్రీ అందే బాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. ఈ శిబిరానికి విదేశాల నుంచి పలువురు వైద్యులు వస్తున్నారు. ఇక్కడి ప్రజలంతా ఈ వైద్య శిబిరం సేవలు వినియోగించుకోవాలి. పేదలకు వైద్య సేవలు అందాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారు. నేను, ప్రసీద, బాబు ప్రభాస్ ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తున్నాం. సుమారు వెయ్యి మంది వరకు ఈ వైద్య శిబిరానికి వస్తారని ఆశిస్తున్నామని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
====================
*Guntur Kaaram: ‘కుర్చీ మడతపెట్టి’ పాట.. నిజంగానే మడతపెట్టేస్తోంది
*****************************
*Sundeep Kishan: ‘ఈగల్’ రిలీజ్ డేట్ విషయంలో మాకు ఎలాంటి కాల్స్ రాలేదు
*********************************
*NTR: ఎన్టీఆర్‌కు హాలీవుడ్, బాలీవుడ్ అవకాశాలు వచ్చినా తిరస్కరించారు.. ఎందుకంటే?
*******************************
*Pawan Kalyan: కన్నీరు తెప్పించావు.. జనసైనికుల లేఖలు చూసి పవన్ భావోద్వేగం
****************************