Nikhil: అలాంటి ఆటగాళ్లను సత్కరించినందుకు గర్వంగా ఉంది..

ABN , Publish Date - Mar 09 , 2024 | 09:55 PM

ఎఫ్‌ఎన్‌సి‌సి నిర్వహించు 12వ ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ హీరో నిఖిల్ చేతుల మీదుగా శనివారం ప్రారంభమైంది. సౌత్ ఇండియాలోనే ఇది బిగ్గెస్ట్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు 69 టీములు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా చైనాలో జరిగిన టోర్నమెంట్స్‌లో సిల్వర్ మెడల్స్ గెలిచిన పలువురిని ఎఫ్‌ఎన్‌సి‌సి ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించింది.

Nikhil: అలాంటి ఆటగాళ్లను సత్కరించినందుకు గర్వంగా ఉంది..
FNCC 12th All India Open Bridge Tournament Launch Event

ఎఫ్‌ఎన్‌సి‌సి (FNCC) నిర్వహించు 12వ ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ (12th All India Open Bridge Tournament) హీరో నిఖిల్ చేతుల మీదుగా శనివారం ప్రారంభమైంది. సౌత్ ఇండియాలోనే ఇది బిగ్గెస్ట్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు 69 టీములు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా చైనాలో జరిగిన టోర్నమెంట్స్‌లో సిల్వర్ మెడల్స్ గెలిచిన పలువురిని ఎఫ్‌ఎన్‌సి‌సి ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించింది. ప్రారంభోత్సవం అనంతరం హీరో నిఖిల్ (Hero Nikhil) మాట్లాడుతూ.. నన్ను ఈ ఈవెంట్‌కి పిలిచినందుకు ముళ్లపూడి మోహన్‌గారికి కృతజ్ఞతలు. నేను ఒక యాక్టర్‌ని.. కానీ ఇలా ఈవెంట్‌కి వచ్చి స్పోర్ట్స్‌మెన్‌ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మాలాంటి యాక్టర్స్‌ని ఇలాంటి ఫంక్షన్స్‌కి పిలిచి స్పోర్ట్స్‌మెన్స్‌తో కలిపి మాకు కూడా ఒక మైండ్ రిఫ్రిషింగ్ ఈవెంట్‌లాగా చేయడం చాలా ఆనందంగా ఉంది. స్పోర్ట్స్ టోర్నమెంట్‌లో ఇంటర్నేషనల్ వరకు వెళ్లి ఇండియా కోసం గోల్డ్, సిల్వర్ మెడల్స్ గెలిచిన ఆటగాళ్లని కలవడం.. వాళ్లని సత్కరించడం ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ బ్రిడ్జి టోర్నమెంట్ ద్వారా ఆడుతున్న టీమ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఇప్పుడున్న యువత ఈ బ్రిడ్జ్ టోర్నమెంట్ గురించి తెలుసుకోవాలి. దీని ద్వారా ఇంకా ఎక్కువ మంది యువకులు ముందుకొచ్చి పార్టిసిపేట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.


Hero-Nikhil.jpg

ఎఫ్‌ఎన్‌సి‌సి వైస్ ప్రెసిడెంట్ రంగారావు (Tummala Ranga Rao) మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్లో పాల్గొనే టీమ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. మన హీరో నిఖిల్ ఈ టోర్నీని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఎఫ్‌ఎన్‌సిసి సెక్రెటరీ ముళ్ళపూడి మోహన్ (Mullapudi Mohan) మాట్లాడుతూ.. హీరో నిఖిల్‌కి మా ఎఫ్‌ఎన్‌సి‌సి తరఫున ధన్యవాదాలు. ఇంత ఘనంగా ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేసి ఏర్పాట్లు చేసినందుకు రమణమూర్తి ధన్యవాదాలు. బ్రిడ్జ్ టోర్నమెంట్‌ని స్పాన్సర్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న నవయుగ ఇంజనీరింగ్ విశ్వేశ్వర్‌కు కృతజ్ఞతలు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌ని దేశంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్లే మా ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు. గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాము. అందరి సపోర్ట్‌తో ముందు ముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నామని తెలిపారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Shambho Mahadeva: మణిశర్మ మెప్పు పొందిన వర్ధమాన గాయని.. ఎవరంటే?

************************

*Keerthi: మహిళలపై అరాచకాలు జరుగుతుంటే దేవుడెక్కడ? అంటూ నటి సంచలన వ్యాఖ్యలు

*******************************

*Odela 2: శివశక్తిగా తమన్నా భాటియా.. ఫస్ట్ లుక్ ఇదే..

****************************

Updated Date - Mar 09 , 2024 | 09:55 PM