Venkat Prabhu అదిరింద‌య్యా ప్ర‌భు.. గాయకుడిగా వ‌చ్చి.. ఆగ్ర దర్శకుడై!

ABN , Publish Date - Aug 09 , 2024 | 01:40 PM

చిత్రపరిశ్రమలోకి గాయకుడిగా అడుగుపెట్టి.. ఇపుడు కోలీవుడ్‌ అగ్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు వెంకట్‌ ప్రభు. ఆగస్టు 7తో 18 యేళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు ప్ర‌ముఖ హాస్య నటుడుప్రేమ్‌జీ అమరన్ సోషల్‌ మీడియా వేదిక‌గా వెల్లడించారు.

venkat

చిత్రపరిశ్రమలోకి గాయకుడిగా అడుగుపెట్టిన దర్శకుడు వెంకట్‌ ప్రభు (Venkat Prabhu).. ఇపుడు దర్శకుడిగా స్థిరపడి కోలీవుడ్‌లోని అగ్ర దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆగస్టు 7వ తేదీతో 18 యేళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు ప్ర‌ముఖ హాస్య నటుడు, గాయకుడు ప్రేమ్‌జీ అమరన్ (Premji Amaran) సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా తన అన్నకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

prabhu.jpg

ప్ర‌ఖ్యాత సంగీత ద‌ర్శ‌కుడు ఇసైజ్ఞాని ఇళ‌య‌రాజా త‌మ్ముడు.. సంగీత దర్శకుడు, నటుడు, గేయ రచయిత, సింగర్‌ గంగై అమరన్‌ వారసుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన వెంకట్‌ ప్రభు.. తొలుత సింగర్‌గా ఎంట్రీ ఇచ్చారు. కొన్ని పాటలు పాడిన తర్వాత పలు చిత్రాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించారు. సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ‘ఉన్నై శరణడైందేన్‌’ సినిమాలో హీరోగా కూడా నటించారు.


tVaW_BeV_400x400.jpg

అయితే, 2007లో వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన ‘చెన్నై 28’ సినిమా అనూహ్యంగా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఆయన ‘సరోజ’, ‘గోవా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను నిరాశ పరిచినప్పటికీ హీరో అజిత్‌.. వెంకట్‌ ప్రభు (Venkat Prabhu)కు ఓ అవకాశం ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్‌లో 2011లో వచ్చిన ‘మంగాత్త’ సినిమా సూపర్‌హిట్‌ సాధించింది.

goat.jpg

ఆ తర్వాత ‘బిర్యాని’, ’మాసు’, ‘చెన్నై 28 - పార్ట్‌’, 2021లో ‘మానాడు’ వంటి చిత్రాలను రూపొందించారు. తెలుగులో నాగ చైతన్య హీరోగా ‘కస్టడీ’ మూవీని తెరకెక్కించారు. ప్రస్తుతం విజయ్‌ 68వ చిత్రం ‘ది గోట్‌’ను రూపొందిస్తున్నారు. ఆయన దర్శకుడుగా పనిచేసిన తొలి రోజు 2006 ఆగస్టు 7వ తేదీ. ఈ విషయాన్ని ఆయన సోదరుడు ప్రేమ్‌జీ (Premji Amaran) గుర్తు చేశారు. ఈ సందర్భంగా వెంకట్‌ ప్రభు (Venkat Prabhu)కు పలువురు సినీ ప్రముఖులు విషెస్‌ చెబుతున్నారు.

Updated Date - Aug 09 , 2024 | 01:40 PM