Aditi Shankar: టాలీవుడ్‌ వైపు శంకర్‌ కుమార్తె దృష్టి

ABN , Publish Date - Sep 08 , 2024 | 07:46 PM

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ ఎస్‌.శంకర్‌ వారసురాలిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన అదితి శంకర్‌ హీరోయిన్‌గా పలు తమిళ చిత్రాల్లో నటించారు. ఇపుడు టాలీవుడ్‌వైపు ఆమె దృష్టి సారించారు. తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయుకుడిగా తెరకెక్కే చిత్రంలో అదితిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు కోలీవుడ్‌ సమాచారం.

Heroine Aditi Shankar

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ ఎస్‌.శంకర్‌ (Director Shankar) వారసురాలిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన అదితి శంకర్‌ (Aditi Shankar) హీరోయిన్‌గా పలు తమిళ చిత్రాల్లో నటించారు. ఇపుడు టాలీవుడ్‌వైపు ఆమె దృష్టి సారించారు. తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ (Bellamkonda Sreenivas) కథానాయుకుడిగా తెరకెక్కే చిత్రంలో అదితిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు కోలీవుడ్‌ సమాచారం. అదితి ఇప్పటికే పలు తమిళ చిత్రాల్లో నటించి తన ప్రతిభను నిరూపించుకున్నారు. వైద్య విద్యను అభ్యసించిన అదితి శంకర్‌... హీరో కార్తీ నటించిన ‘విరుమన్‌’ ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యారు.

Also Read- Jailer Villain: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ‘జైలర్’ విలన్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆ తర్వాత శివకార్తికేయన్‌ నటించిన ‘మావీరన్‌’లో నటించారు. ప్రస్తుతం ఆమె విష్ణువర్థన్‌ దర్శకత్వంలో ఆకాష్‌ మురళి హీరోగా నటించే ‘నేసిప్పాయా’ సినిమాలో నటించారు. ఆ తర్వాత అర్జున్‌ దాస్‌ హీరోగా నటించే మరో చిత్రంలో కూడా ఆమె నటించనున్నారు. ఇపుడు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. తెలుగులో అనర్గళంగా మాట్లాడగల అదితిని టాలీవుడ్‌ ప్రేక్షకులు ఆదరిస్తారని కోలీవుడ్ సైతం భావిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఆమె గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘గేమ్ చేంజర్’ చిత్రంలోనూ ఓ పాత్రలో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. (Aditi Shankar Eye on Tollywood)


Shankar-with-Daughter.jpg

ఇంతకు టాలీవుడ్‌లో జరిగిన ఓ సినిమా ఫంక్షన్‌లో ఆమె చేసిన డ్యాన్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాగే కార్తీ, శివకార్తికేయన్ చిత్రాలు తెలుగులోనూ విడుదలవడంతో.. తెలుగు ప్రేక్షకులకు ఆమె ఇప్పటికే పరిచయమై ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్‌గా బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంతో ఎంట్రీ ఇస్తున్న అదితి శంకర్.. ఏ మేరకు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటుందో.. వెయిట్ అండ్ సీ. అదితి తెలుగు సినిమాలో చేసే విషయమై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

Read Latest Cinema News

Updated Date - Sep 08 , 2024 | 07:46 PM