Manchu Family: మంచు ఫ్యామిలీకి సీపీ వార్నింగ్..
ABN , Publish Date - Dec 11 , 2024 | 01:47 PM
గత మూడు రోజులుగా మంచు ఫ్యామిలీలో ఎటువంటి వాతావరణ నెలకొని ఉందో తెలిసిందే. మంగళవారం రాత్రి అయితే పెద్ద యుద్ధమే జరిగినంత పనైంది. మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లగా.. మోహన్ బాబు కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. మొత్తంగా ఈ పరిస్థితిని గమనించిన రాచకొండ సీపీ వారికి నోటీసులు జారీ చేసి.. బుధవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మనోజ్ సీపీ ముందుకు హాజరయ్యారు.
మంచు ఫ్యామిలీలో గత మూడు రోజులుగా ఎలాంటి వివాదం చోటు చేసుకుందో తెలిసిందే. మరీ ముఖ్యంగా మంగళవారం రాత్రి వారి ఫ్యామిలీలో యుద్ధ వాతావరణం నెలకొంది. వారి గొడవపై రాచకొండ సీపీ మంచు హీరోలైన మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్‌లకు నోటీసులు ఇచ్చారు. బుధవారం 10.30కు విచారణకు రావాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో మంచు మనోజ్ బుధవారం నాడు నేరేడ్‌మెట్‌లోని రాచకొండ సీపీ కార్యాలయానికి వచ్చారు. సీపీ ముందు విచారణకు హాజరయ్యారు. సీపీ సుధీర్ బాబు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు మంచు మనోజ్. ఈ సందర్భంగా సీపీ కీలక కామెంట్స్ చేశారు.
మంచు మనోజ్, మోహన్ బాబు, విష్ణు వల్ల శాంతి భద్రతల విఘాతం కలిగినందున నోటీసులు ఇచ్చినట్లుగా తెలిపారు సీపీ. మరోసారి శాంతి భద్రతలకు విగాథం కలిగేలా వ్యవహరించొద్దని సీపీ వార్నింగ్ ఇచ్చారు. ఏడాది వరకు ఎలాంటి గొడవలు గానీ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం గానీ చేయొద్దని స్పష్టం చేశారు. అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో సీపీ ఈ దేశాలిచ్చారు. ఒకవేళ ఎలాంటి ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసినా.. లక్ష రూపాయల జరిమానా ఉంటుందని సీపీ హెచ్చరించారు.
మంచు మోహన్‌బాబు కుటుంబంలో గత మూడు రోజులుగా ఇంటి గొడవలు ఎలా రచ్చకెక్కాయో తెలిసిందే. ఆ గొడవలు ఇప్పుడు మరింత ముదిరి తారాస్థాయికి చేరాయి. మోహన్‌బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ మధ్య చోటుచేసుకున్న వివాదం.. మంగళవారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద మనోజ్ బౌన్సర్లు, మోహన్‌బాబుకు రక్షణగా ఆయన పెద్ద కుమారుడు విష్ణు నియమించిన బౌన్సర్లకు మధ్య ఘర్షణ జరిగింది. మనోజ్, మౌనికలను మోహన్‌బాబు ఇంట్లోకి రానివ్వకపోవడంతో.. మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం ఘర్షణను మరింత పెద్దది చేసింది.
జల్‌పల్లిలో జరిగిన ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఫిల్మ్‌నగర్ పోలీసులు మోహన్‌బాబు, మనోజ్ లైసెన్స్ గన్‌లను స్వాధీనం చేసుకొని, సీజ్ చేశారు. బుధవారం విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ మోహన్‌బాబు, మంచు మనోజ్, మంచు విష్ణులకు రాచకొండ సీపీ నోటీసులు జారీ చేశారు.