భరణి మాటకు, సుద్దాల పాటకు మధ్య పురాణపండ మంత్రశబ్దానికి అభినందన

ABN , Publish Date - Aug 20 , 2024 | 07:44 PM

తన కోసం తాను బ్రతకకుండా, జీవితంలో పదిమందికీ మేలు చేస్తూ దైవీయ స్పృహల పరమాద్భుత గ్రంధాలను వేల, లక్షల సంఖ్యలో తెలుగు వాకిళ్ళకు అందిస్తున్న రచనా, సంకలనకర్త, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌కు ఒక వైపు వొళ్ళు గగుర్పొడిచే ‘కొమరం భీముడో’ అద్భుత గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, మరొకవైపు ఆటగదరా శివా అద్వైత తత్వ వాగ్గేయ కారులు, అసాధారణ నటులు తనికెళ్ళ భరణి నిలబడి.. తమ మధ్యలో మంత్ర శబ్దంలా నిలబడిన శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరిస్తున్న రమణీయ కమనీయ దృశ్యం.

కేవలం తన కోసం తాను బ్రతకకుండా, జీవితంలో పదిమందికీ మేలు చేస్తూ దైవీయ స్పృహల పరమాద్భుత గ్రంధాలను వేల, లక్షల సంఖ్యలో తెలుగు వాకిళ్ళకు అందిస్తున్న రచనా, సంకలనకర్త, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌కు ఒక వైపు వొళ్ళు గగుర్పొడిచే ‘కొమరం భీముడో’ అద్భుత గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, మరొకవైపు ఆటగదరా శివా అద్వైత తత్వ వాగ్గేయ కారులు, అసాధారణ నటులు తనికెళ్ళ భరణి నిలబడి.. తమ మధ్యలో మంత్ర శబ్దంలా నిలబడిన శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరిస్తున్న రమణీయ కమనీయ దృశ్యం. ఇటీవల రవీంద్రభారతిలో జరిగిన ఒక మనోజ్ఞమైన కార్యక్రమంలో ఈ దృశ్యం రసజ్ఞులచే వన్స్ మోర్ కొట్టించడం విశేషం.

పురాణపండ శ్రీనివాస్.. అనగానే వందల దేవాలయాల్లో, పీఠాల్లో, మఠాల్లో, ధార్మిక మండళ్లలో పరమ పవిత్రమైన గ్రంధాలు కోకొల్లలు మనకి దర్శనమిస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆకెళ్ళ విభీషణశర్మ చెప్పినట్లు భారతదేశ చరిత్రలో తెలుగులో ఇలాంటి చక్కని రచనా సంకలనాలు ఎంతో వైభవంగా ప్రచురించి ఉచితంగా అందివ్వడం చారిత్రాత్మకమైన విషయం. పండితులూ, ప్రవచనకర్తలూ, పీఠాధిపతులూ తమ ప్రసంగాల బయట తమ గ్రంధాలను కౌంటర్‌లు పెట్టి మరీ అమ్ముకుంటున్న ఈరోజుల్లో ఇలాంటి త్యాగనిరతి శ్రీనివాస్‌కి ఎలా వచ్చిందో.. కేవలం ఇది తిరుమల శ్రీనివాసుని కారుణ్యమే అంటారు విభీషణ శర్మ.


Bharani.jpg

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరంజీవి, బాలకృష్ణ మొదలు భారతదేశ హోమ్ శాఖామంత్రి అమిత్ షా వరకు ఎందరో యోధులు పురాణపండ శ్రీనివాస్ సౌందర్యభరిత అపురూప గ్రంధాలను ఆవిష్కరించి.. స్పష్టంగా ప్రశంసించడం శ్రీనివాస్ స్వయంకృషి మంత్రానికి ఫలమేనని చెప్పక తప్పదు. తనికెళ్ళ భరణి, సుద్దాల అశోక్ తేజల మధ్య సత్కారగ్రహీతగా నిలబడ్డ పురాణపండ శ్రమైక జీవన సౌందర్యానికి అభినందలు చెప్పక తప్పదు.

కాలానికి ఎదురీదుతూ.. ఎందరి విమర్శలనో విరిచి విసిరేస్తూ.. ఉత్తమ అద్భుత లక్ష్యాల వైపు దూసుకుపోతున్న పురాణపండ ధార్మిక గ్రంధాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అన్ని వర్గాలవారివద్ద అధిక శాతం ఉండటం, ఈ గ్రంధాల పట్ల పరిశ్రమలో ఆసక్తి చూపడం గమనార్హం.

Updated Date - Aug 21 , 2024 | 10:34 AM