సూచిరిండియా ఇఫ్తార్ విందు పార్టీలో సెలబ్రిటీల సందడి

ABN , Publish Date - Apr 01 , 2024 | 09:43 PM

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు, ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని సూచిరిండియా అధినేత లయన్ కిరణ్ అన్నారు. సోమవారం మెర్క్యూరే హోటల్‌లో సూచిరిండియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ప్రముఖులు పాల్గొన్నారు.

సూచిరిండియా ఇఫ్తార్ విందు పార్టీలో సెలబ్రిటీల సందడి

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు, ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని సూచిరిండియా అధినేత లయన్ కిరణ్ అన్నారు. సోమవారం మెర్క్యూరే హోటల్‌లో సూచిరిండియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ప్రముఖులు పాల్గొన్నారు. అనాథ ముస్లిం బాలలకు ఇఫ్తార్ విందుతో పాటు ఆయన దుస్తులు ఇచ్చారు.

Iftar-party.jpg

ఈ సందర్భంగా లయన్ కిరణ్ మాట్లాడుతూ... ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు నిర్వహిస్తారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులు ఇచ్చే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. రంజాన్ పండుగ ప్రజల జీవితాలలో సుఖసంతోషాలను నింపాలని ఆ అల్లాహ్‌ను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 03:55 PM