డెమోక్రటిక్ సంఘ చేంజ్ మేకర్ అవార్డుల వేడుకలో సెలబ్రిటీల సందడి
ABN , Publish Date - Dec 21 , 2024 | 10:29 PM
నటి రెజెనా కసాండ్రా సహవ్యవస్థాపకురాలిగా డెమోక్రటిక్ సంఘ మొదటిసారి రేస్ 2 విన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేంజ్ మేకర్ అవార్డులను అందించింది. ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. సుస్మితా సేన్, భూమి ఫడ్నేకర్, హెబా పటేల్, ఐశ్వర్య రాజేష్ వంటి సెలబ్రిటీలందరూ ఈ వేడుకలో సందడి చేశారు.
రేస్ 2 విన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డెమోక్రటిక్ సంఘ.. చేంజ్ మేకర్ అవార్డులను అందించింది. హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన ఈ అవార్డుల వేడుకలో సెలబ్రిటీలు సందడి చేశారు. దేశవ్యాప్తంగా సమాజంలో మార్పు కోసం పాటుపడిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి వారికి ఈ అవార్డులను అందజేశారు. చేంజ్ మేకర్ అవార్డులను ప్రజాస్వామ్య సూత్రాలు, సామాజిక న్యాయం మరియు మానవ హక్కుల పురోగతి విషయంలో గణనీయమైన కృషి చేసిన వారిని ప్రతి సంవత్సరం డెమోక్రటిక్ సంఘ సత్కరిస్తుంది. ఈ ఏడాది కూడా ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యురాలు జి. రేణుకా చౌదరి హాజరయ్యారు. గౌరవ అతిథిగా మిస్ యూనివర్స్-1994 సుస్మితా సేన్, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ కూడా ఇందులో పాలుపంచుకున్నారు.
Also Read-Allu Arjun Press Meet: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఏమన్నారంటే..
సమకాలీన భారతదేశంలో సంఘ సంస్కరణ మరియు యువత సాధికారత యొక్క ప్రాముఖ్యతపై నటి, సామాజిక కార్యకర్త భూమి ఫడ్నేకర్ ఓ కీలక ప్రసంగం చేశారు. బాలల హక్కులు, బానిస కార్మికులు, మహిళల హక్కులు మరియు ప్రధాన స్రవంతి సమాజంలో అట్టడుగు వర్గాలను ఏకం చేయడం వంటి అంశాలపై కృషి చేసిన ప్రముఖ సంఘ సంస్కర్త, సామాజికి కార్యకర్త స్వామి అగ్నివేష్‌కు నివాళులర్పిస్తూ ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన పేరు పెట్టారు.
బంధువా ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ స్వామి అగ్నివేష్, 1.72 లక్షల మంది కార్మికులను బానిస కార్మికులకు విముక్తి చేశారు. మత సహనం మరియు సయోధ్యను పెంపొందించడానికి ఆయన అవిశ్రాంతంగా పనిచేశారు. అతను 2004లో ప్రత్యామ్నాయ నోబెల్ బహుమతిగా పిలువబడే రైట్ లైవ్లీహుడ్ అవార్డును కూడా అందుకోవడం గమనార్హం. స్వామి అగ్నివేష్ అడుగు జాడల్లో నడుస్తూ సామాజిక న్యాయం, సమానత్వం మరియు మానవ హక్కుల కోసం పాటుపడే వ్యక్తులు, సంస్థలను డెమోక్రటిక్ సంఘ గుర్తిస్తుంది. అలాంటి వారికి చేంజ్ మేకర్ అవార్డులను అందజేస్తుంది.
డెమోక్రటిక్ సంఘ గురించి:
డెమోక్రటిక్ సంఘ అనేది స్వామి అగ్నివేష్ విద్యార్థి చైతన్య MRSK స్థాపించబడిన లాభాపేక్ష లేని, నిరపేక్ష సామాజిక సంస్కరణ సంస్థ. మానవ హక్కులు, చట్ట పాలన, మహిళా నాయకత్వం, పౌర విద్య మరియు ఎన్నికల సంస్కరణలు సహా ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన సూత్రాలను ప్రోత్సహించడానికి ఈ సంస్థ అంకిత భావంతో పనిచేస్తోంది. నటి రెజెనా కసాండ్రా సహవ్యవస్థాపకురాలిగా ఉన్నారు.