Bigg Boss 8: బిగ్‌బాస్ సీజ‌న్‌8.. మొద‌టి నామినేష‌న్ ర‌చ్చ‌రచ్చ‌

ABN , Publish Date - Sep 04 , 2024 | 11:28 AM

బిగ్‌బాస్ సీజ‌న్‌8 అనుకున్న‌ట్లుగానే లిమిట్‌లెస్‌గానే ప్రారంభ‌మైంది. తాజాగా మంగ‌ళ‌వారం రోజున జ‌రిగిన సీజన్ 8 తొలి నామినేషన్స్ ప్ర‌క్రియ‌ చాలా హాట్‌గా జరిగింది.

biggboss

Bigg Boss Telugu Season 8: బిగ్‌బాస్ సీజ‌న్‌8 అనుకున్న‌ట్లుగానే లిమిట్‌లెస్‌గానే ప్రారంభ‌మైంది. మొద‌టి రోజు నుంచే ఎవ‌రికి వారు మాట ప‌డ‌కుండా త‌మ వాయిస్‌ను పెద్ద‌గా వినిపిస్తూ ఈ సీజ‌న్ మాములుగా ఉండద‌న్న చందాన తీసుకెళుతున్నారు. స్టార్టింగ్ రోజు నుంచే గొడ‌వ‌లేసుకుంటూ ఒక‌రిపై ఒక‌రు పోటీ ప‌డి మ‌రీ వార్స్ చేసుకుంటున్నారు. మొద‌టి రోజే శేఖ‌ర్‌, భాషా, మ‌ణికంఠ‌, సోనియాలు త‌మ వాయిస్ ప‌వ‌ర్‌ను చూయించారు.

తాజాగా మంగ‌ళ‌వారం రోజున జ‌రిగిన సీజన్ 8 తొలి నామినేషన్స్ ప్ర‌క్రియ‌ చాలా హాట్‌గా జరిగింది. నిఖిల్, యశ్మీ, నైనిక సమక్షంలో సోనియా.. బేబక్క, ప్రేరణల‌ను నామినేట్ చేస్తూ నామినేషన్స్‌ను మొదలు పెట్టింది. తర్వాత నబిల్, శేఖర్ బాషా ఇద్ద‌రు.. మణికంఠ, బేబక్కల‌ను, బేబక్క.. పృథ్వీ, నబిల్‌ల‌ను నామినేట్ చేశారు.

మంగ‌ళ‌వారం ఎపిసోడ్ ముగిసే స‌మ‌యానికి మణికంఠ, బేబక్క, పృథ్వీ నామినేష‌న్ పోటీలో ఉండ‌గా మిగ‌తా స‌భ్యుల‌ నామినేష‌న్ కార్య‌క్ర‌మం బుధ‌వారం ఎపిసోడ్‌లో తేలనుంది. మ‌రి సీజన్ 8 బిగ్‌బాస్‌ మొదటి వారంలో ఎవ‌రు పోటీలో ఉంటారో తెలియ‌నుంది. ఓటింగ్ కార్య‌క్ర‌మం స్టార్ట్ కానుంది.

Updated Date - Sep 04 , 2024 | 11:28 AM