Bigg Boss 8: పాపం.. సూట్ కేస్ లేకుండానే నబీల్ అవుట్
ABN , Publish Date - Dec 15 , 2024 | 10:15 PM
పాపం సూట్ కేస్ ఆఫర్ వచ్చినా.. గెలుస్తాననే నమ్మకంతో ఆఫర్‌ని వదులుకున్న నబీల్ టాప్ 3 కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్ నుండి వెనుదిరిగారు.
ప్రేరణ ఎలిమినేట్ అయిన అనంతరం హౌస్‌లో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్స్‌కు నాగార్జున సూట్ కేస్ ఆఫర్ చేయగా.. ముగ్గురు తమకు వద్దని చెప్పారు. అనంతరం ‘విడుదలై 2’ చిత్ర ప్రమోషన్ నిమిత్తం బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన విజయ్ సేతుపతిని నాగార్జున హౌస్‌లోకి పంపించగా.. ఆయన టాప్ 3 స్థానంలో నబీల్ ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించి, హౌస్ నుండి బయటకు తీసుకువచ్చారు. స్టేజ్‌పైకి వచ్చిన విజయ్ సేతుపతి బెజవాడు బేబక్కకు ఓ సలహా కూడా ఇచ్చారు. గుడ్ ఫుడ్ హ్యాపీనెస్ ఇస్తుందని చెప్పినందుకు.. ఎంత సేపు తింటారో, అంత సేపు వర్కవుట్ చేయాలని విజయ్ సేతుపతి ఆమెకు సలహా ఇచ్చారు.
Also Read:Bigg Boss S8 Grand Finale: ప్రైజ్ మనీ ఎంతో చెప్పిన నాగ్..
అనంతరం సూట్ కేస్ తీసుకోలేదని ఏమైనా ఫీలయ్యావా? అని నబీల్‌ని నాగార్జున అడగగా.. తాను డబ్బుల కోసం ‘బిగ్ బాస్ 8’కి రాలేదని నబీల్ చెప్పాడు. ఈ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులు గెలుచుకున్నందుకు సంతోషంగా ఉందని నబీల్ చెప్పాడు.