Bigg Boss 8: టాప్ 5‌లో ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే..

ABN , Publish Date - Dec 15 , 2024 | 09:30 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే‌లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్‌లో నుండి ఫస్ట్ ఎలిమినేషన్ జరిగింది. కన్నడ స్టార్ ఉపేంద్ర ఆ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌ని స్టేజ్ మీదకు తీసుకు వచ్చారు. ఆ కంటెస్టెంట్ ఎవరంటే..

Bigg Boss Telugu Season 8 Grand Finale

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో ట్రోఫీని నాగార్జున రివీల్ చేశారు. ఆ ట్రోఫీ విన్ అయ్యేది ఎవరో కాస్తేపట్లో తెలుస్తుందని కంటెస్టెంట్స్‌ని టెన్షన్ పెట్టి బ్రేక్ చెప్పిన నాగార్జున, బ్రేక్ తర్వాత యుఐ మూవీ హీరో, కన్నడ స్టార్‌ ఉపేంద్రని స్టేజ్ మీదకు ఆహ్వానించారు. మాకు నాగార్జున అంటే ఇష్టం అని ఉపేంద్ర చెప్పగా.. నా సినిమాలైన ‘మన్మథుడు’, ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలను కన్నడలో ఉపేంద్ర రీమేక్ చేశారని నాగార్జున చెప్పారు.

Also Read: Bigg Boss S8 Grand Finale: ప్రైజ్ మనీ ఎంతో చెప్పిన నాగ్..

ఆడియెన్స్‌కి మనం ఏదో చెప్పాలని సినిమాలు చేస్తుంటామని, అయితే ‘యుఐ’ చూసిన తర్వాత ప్రేక్షకులు చెబితే తాను వినాలని కొత్త ప్రయోగం చేశానని ఉపేంద్ర చెప్పారు. అనంతరం ఉపేంద్ర నటించిన లేటెస్ట్ మూవీ ‘యుఐ’ సినిమా టీజర్‌ను ప్లే చేశారు. ప్రేక్షకుల తెలివికి ‘యుఐ’ సినిమా సవాల్ లాంటిదని ఉపేంద్ర అన్నారు. ఈ సినిమా ఇంటెలిజెన్స్ పీపుల్ కోసం తీశామని చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా లాస్ట్ షాట్ మెస్మరైజ్ చేస్తుందని తెలిపారు.


Avinash.jpg

అనంతరం ఉపేంద్రని హౌస్‌లోకి పంపిన నాగార్జున టాప్ 5 కంటెస్టెంట్‌లో ఫస్ట్ ఎలిమినేషన్‌గా ఎలిమినేట్ అయిన ముక్కు అవినాష్‌ని బయటకు తీసుకువచ్చారు. వస్తూ వస్తూ మిగతా కంటెస్టెంట్స్‌కి అవినాష్ హగ్ ఇచ్చారు. ఇంకా హౌస్‌లో నలుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఫస్ట్ ఫైనలిస్ట్‌గా స్టేజ్ మీదకు వచ్చిన అవినాష్.. రావడమే తేజకు క్లాస్ ఇచ్చాడు. నువ్వు అరిస్తే ‘మైక్‌తో కొడతా’ అన్నాడు. రెండోసారి తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిన అవినాష్.. ప్రేక్షకులకు మరోసారి ఎంటర్‌టైన్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపాడు. బిగ్ బాస్ ట్రోఫీ గెలవకపోయినప్పటికీ ప్రేక్షకుల హృదయాలను గెలిచి ఇంతదూరం వచ్చినందుకు హ్యాపీగా ఉందని అన్నారు. నాన్న, అన్నయ్య సిట్టింగ్ వేద్దామనే సరికి ఇలా వచ్చేశానని చమత్కరించాడు.

Also Read-Chiru - Bunny: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అల్లు అర్జున్.. పిక్ వైరల్.. ఇక ఫుల్‌స్టాప్ పెట్టినట్టేనా!

Also Read-Bunny-Balayya: బన్నీకి బాలయ్య ఫోన్..

Also Read-రేలంగి వివాహ ఆహ్వాన పత్రిక: 91 సంవత్సరాల క్రితపు శుభలేఖను చూశారా..


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 15 , 2024 | 09:38 PM