Bigg Boss 8 Finale: ప్రేరణ అవుట్.. సూట్ కేస్ రిజిక్ట్ చేసిన ముగ్గురు కంటెస్టెంట్స్
ABN , Publish Date - Dec 15 , 2024 | 09:52 PM
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టాప్ 5 కంటెస్టెంట్‌గా అవినాష్ ఎలిమినేట్ అయిన అనంతరం మరో ఎలిమినేషన్ జరిగింది. టాప్ 4 కంటెస్టెంట్‌గా ఉన్న ఒకే ఒక్క లేడీ ప్రేరణ ఎలిమినేట్ అయింది. ఇక హౌస్‌లో ఉన్న ముగ్గురికి నాగార్జున డబ్బులతో నిండిన సూట్ కేస్ ఆఫర్ చేశారు.
అవినాష్ ఎలిమేషన్ తర్వాత బిగ్ బాస్ ఇంటిలో ఉన్న టాప్ 4 కంటెస్టెంట్లలో ఒకరిని బయటకు తీసుకు రావడం కోసం ‘డాకు మహారాజ్’ ప్రమోషన్స్ నిమిత్తం వచ్చిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ను ఇంటిలోకి పంపించారు నాగార్జున. ఆమె స్టేజ్ మీదకు వచ్చినప్పుడు తనతో పాటు ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా చేసిందని నాగార్జున చెప్పారు. ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ.. జనవరిలో తాను నటించిన ‘డాకు మహారాజ్’ రిలీజ్ అవుతుందని, ఆ నెలలో తన బర్త్‌డే కూడా ఉండటంతో తనకు అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చింది.
Also Read:Bigg Boss S8 Grand Finale: ప్రైజ్ మనీ ఎంతో చెప్పిన నాగ్..
ఇంటిలోకి వెళ్లిన ప్రగ్యా జైస్వాల్.. టాప్ 4 కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయిన ప్రేరణను స్టేజ్ మీదకు తీసుకువచ్చింది. బిగ్ బాస్ ఈ సీజన్‌లో ఇంటిలో మొదట అడుగు పెట్టిన కంటెస్టెంట్లలో ప్రేరణ ఒకరు. పదిహేను వారాలు, 105 రోజులు పాటు ఇంటిలో ఉండి, ఈ సీజన్ టాప్ 5కి చేరిన ఒకే ఒక్క మహిళగా నిలిచారు. ఇప్పుడామె టాప్ 4గా బిగ్ బాస్ హౌస్ బయటికి వచ్చేశారు.
Also Read- Bigg Boss 8: టాప్ 5లో ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే..
ఇక హౌస్‌లో మిగిలిన నిఖిల్, గౌతమ్, నబీల్‌లకు నాగార్జున సూట్ కేస్‌లో అమౌంట్ ఉందని అది తీసుకోమని మీలో ఎవరైనా ఒకరు బయటకి వచ్చేయవచ్చని ఆఫర్ చేయగా.. ఆ ముగ్గురూ ఆ సూట్ కేస్‌ని రిజిక్ట్ చేశారు. అసలైన ఆట ఇప్పుడు మొదలైంది.