Bigg Boss Telugu 8 Grand Finale: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ ఫిక్స్..

ABN , Publish Date - Dec 15 , 2024 | 08:12 AM

బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకి చీఫ్ గెస్ట్ ఫిక్స్ అయ్యారు. ఇంతకీ ఆ చీఫ్ గెస్ట్ అల్లున, మెగాన అంటే..

ఎట్టకేలకు తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 ఫినాలేకి చేరుకుంది.14 వారాల షో క్లైమాక్స్‌కి వచ్చేసింది. దీంతో విజేతగా ఎవరు నిలుస్తురనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈ ఫినాలేకి గెస్ట్ లుగా స్టార్లు రాబోతున్నారు. ఇక చీఫ్ గెస్ట్ విషయంలో కాస్త సందిగ్ధత ఏర్పడిన ఫైనల్‌గా ఫిక్స్ చేసేశారట.


గెస్టులు వీరే..

ఆదివారం జరగనున్న ఫినాలేకి 'పుష్ప 2' టీమ్ నుండి సుకుమార్, రష్మిక రానున్నట్లు సమాచారం. అలాగే సంక్రాంతికి రిలీజ్ కానున్న బాలకృష్ణ 'డాకు మహారాజ్' టీమ్ కూడా ఈ ఈవెంట్ లో సందడి చేయనుంది. డైరెక్టర్ బాబీ కాలితో పాటు ఇంకెవరైన ఈ ఈవెంట్ లో పాల్గొననున్నారు. ఇక క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్న ఉపేంద్ర యూఐ సినిమా ప్రమోషన్స్ కూడా నిర్వహించనున్నారు. అలాగే మెగా హీరో సాయి దుర్గా తేజ్ 'సంబరాల ఏటిగట్టు' విశేషాలు పంచుకోనున్నారు. ఇక హీరోయిన్ నభా నటేష్ స్పెషల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వనుంది. విడుదలై పార్ట్ 2 ప్రమోషన్స్ కోసం విజయ్ సేతుపతి కూడా రానున్నట్లు సమాచారం.


చీఫ్ గెస్ట్ ఎవరంటే..

అయితే గ్రాండ్ ఫినాలేకి చీఫ్ గెస్ట్‌గా ఎవరు వస్తారనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొదటగా అల్లు అర్జున్‌ని చీఫ్ గెస్టుగా కన్సిడర్ చేసిన ఆయన అందుబాటులో ఉండటం కష్టం అని తెలిసింది. దీంతో 'గేమ్ ఛేంజర్' రామ్ చరణ్‌ని చీఫ్ గెస్ట్‌గా వస్తున్నట్లు పక్కా సమాచారం.

Updated Date - Dec 15 , 2024 | 08:12 AM