Bigg Boss 8 Telugu: గంగవ్వ వర్సెస్ గౌతమ్.. మెగా ఛీప్ ఎవరంటే
ABN , Publish Date - Oct 18 , 2024 | 04:28 PM
మెగా చీఫ్ కంటెండర్ల కోసం బిగ్‌బాస్ పోటీ నిర్వహించాడు. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో ఒక కంటెస్టెంట్ విన్ అయ్యారు. మరో పక్క గంగవ్వ, గౌతమ్ మధ్యలో అనూహ్య పోటీ ఏర్పడటంతో మరింత ఆసక్తి పెరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
బిగ్‌బాస్ హౌస్‌లో గేమ్ చప్పగా నడుస్తున్న కొన్ని గేమ్స్ కాస్తైనా ఆసక్తి రేపుతున్నాయి. మెగా చీఫ్ పొజిషన్ దక్కించుకోవడానికి బిగ్‌బాస్ నిర్వహించిన ఛార్జింగ్ టాస్క్ పూర్తయింది. చీఫ్ కంటెండర్ల కోసం ఇటు రాయల్ క్లాన్ అటు ఓజీ క్లాన్ బాగానే ప్రయత్నాలు చేసిన.. ఫైనల్‌గా రాయల్ క్లాన్ గెలిచింది. దీంతో వారి క్లాన్ నుండే మెగా చీఫ్ కంటెండర్ల కోసం బిగ్‌బాస్ పోటీ నిర్వహించాడు. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో ఒక కంటెస్టెంట్ విన్ అయ్యారు. మరో పక్క గంగవ్వ, గౌతమ్ మధ్యలో అనూహ్య పోటీ ఏర్పడటంతో మరింత ఆసక్తి పెరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఛార్జింగ్ టాస్క్ పూర్తయిన తర్వాత బిగ్‌బాస్.. రాయల్ క్లాన్ సభ్యుల మధ్య మెగా చీఫ్ కోసం "పట్టుకో లేదంటే వదులుకో" అనే టాస్క్ నిర్వహించారు. ఈ గేమ్‌లో సర్కిల్‌లో ఒక ఎముక (బోన్)ని ఉంచి.. కంటెండర్లు అందరు దాని చుట్టూ తిరగాలి. బజర్ మోగినప్పుడు ఎవరైతే ముందుగు బోన్‌ని పట్టుకుంటారో.. వాళ్ళు ఇద్దర్ని గేమ్ నుంచి తొలిగించొచ్చు. ఇలా సాగిన ఈ గేమ్‌లో చివరికి గంగవ్వ, గౌతమ్ మిగిలారు. దీంతో గౌతమ్ సునాయాసంగా గెలిచి.. మెగా చీఫ్ అయ్యాడు. దీంతో ప్రస్తుతం మెగా చీఫ్‌గా వ్యవహరిస్తున్న మెహబూబ్ గోల్డెన్ బ్యాండ్‌ని గౌతమ్‌కి అందించాడు. మరోవైపు ఇంత మంది హౌస్ మేట్స్‌ని ఒక్కరే హ్యాండిల్ చేయలేరంటూ.. బిగ్‌బాస్ మరో ఇద్దరినీ మినీ చీఫ్‌లుగా నియమించారు. గేమ్‌లో చివరి వరకు కొనసాగిన గంగవ్వ, హరితేజ ఆ ఛాన్స్ కొట్టేశారు.
ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బిగ్‌బాస్ మరోసారి ఛార్జింగ్ టాస్క్ షూరూ చేశాడు. దీంతో మరోసారి రాయల్-ఓజీ క్లాన్‌ల మధ్య వార్ స్టార్ట్ అయ్యింది. ఈ టాస్క్‌లో గెలవాలి అంటే.. ప్లాజ్మాలో చూపించిన బొమ్మలు ఏ దిండు కింద ఉన్నాయో వెతికి బాక్స్‌లో వెయ్యాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లోను కంటెస్టెంట్లు ఒకరిని ఒకరు తోసుకున్నారు. కాగా గౌతమ్.. ప్రేరణను తోసేయగా, నయని చేతిలో ఉన్న దిండుని నిఖిల్ బలవంతగా లాక్కున్నాడు. దీంతో ఫైనల్‌గా ఓజీ క్లాన్ గెలిసినట్లు తెలుస్తోంది. దీంతో ఓజీ క్లాన్ మరో అడ్వాంటేజ్‌ని సొంతం చేసుకుంది. మెగా చీఫ్ కంటెండర్స్ నుండి ఒకరిని తొలిగించే ప్రక్రియ మొదలు పెట్టాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇలా కొన్నిసార్లు సప్పగా మరికొన్ని సార్లు సాల్టీ అండ్ స్పైసీగా బిగ్‌బాస్ కొనసాగుతుంది.