Anchor Suma: ఇక ఆ అవసరం లేదంటోంది..
ABN , Publish Date - Oct 10 , 2024 | 10:09 PM
ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఆయుర్వేద వైద్యం అనేది చాలా పురాతనమైన వైద్యం. ఇది ఎక్కువగా కేరళలో చేస్తారు. ఇకపై కేరళ వెళ్లాల్సిన అవసరం లేదంటోంది స్టార్ యాంకర్ సుమ. ఆ వివరాల్లోకి వెళితే..
ఆయుర్వేద వైద్య కోసం ఇక కేరళ వంటి ప్రదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదంటోంది స్టార్ యాంకర్ సుమ కనకాల (Anchor Suma Kanakala). హైదరాబాద్ కూకట్ పల్లి కెపిహెబిలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలోనే ఆటిజం, ADHD ఇష్యూస్ కోసం చిన్నపిల్లలకు పంచకర్మ చికిత్సలను అందించే ఏకైక హాస్పిటల్ శ్రీ ప్రథమ ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఆయుర్వేద వైద్యం అనేది చాలా పురాతనమైన వైద్యం. ఇది ఎక్కువగా కేరళలో చేస్తారు. ఇప్పుడు ఆయుర్వేద వైద్యం కోసం అందరూ అక్కడకి వెళ్లాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్‌లోనే ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు. చిన్నపిల్లలలో ఆటిజం అనేది ఎక్కువగా వస్తుంది. దానికి సరైన వైద్యం అందిస్తే తొందరగా నయమైపోతుంది. అత్యవసరం అయితేనే అల్లోపతి వైద్య విధానాన్ని అనుసరించాలి తప్ప.. సాధారణ పరిస్థితిలో ప్రకృతి సిద్ధంగా వ్యాధులను నయం చేసే ఆయుర్వేద వైద్యాన్నే అనుసరించాలి. ప్రకృతిలో లభించే పదార్ధాలతో చేసిన మందులు మానవుని శరీరం పై చెడు ప్రభావం చూపించకుండా వ్యాధులను నయం చేస్తాయి’’ అని చెప్పారు.
Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్టయన్... ది హంటర్’ ఎలా ఉందంటే..
శ్రీ ప్రథమ ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ వ్యవస్థాపకులు, డైరెక్టర్, మరియు ఆయుర్వేద వైద్య నిపుణురాలు అయిన డాక్టర్. బీశెట్టి శాంతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలోనే ఆటిజం, ADHD ఇష్యూస్ కోసం చిన్నపిల్లలకు పంచకర్మ చికిత్సలను అందించే ఏకైక హాస్పిటల్ శ్రీ ప్రథమ ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్. ఈ హాస్పిటల్ 2011లో ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి హాస్పిటల్ వైజాగ్‌లో ప్రారంభించబడగా.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి బెంగుళూరు మరియు హైదరాబాద్‌లో ఇప్పటికే తమ సేవలను అందిస్తూ వస్తున్నారు. KPHBలో ప్రారంభమైన ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన తెలుగు యాంకర్ సుమగారికి ధన్యవాదాలని తెలిపారు.