Allu Arjun: వారిపై చర్యలు తీసుకుంటాం..

ABN , Publish Date - Dec 22 , 2024 | 04:28 PM

సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించి ఇచ్చిన వివరణ వంటి వాటి తర్వాత.. తాజాగా సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ అల్లు అర్జున్ ఏం చెప్పారంటే..

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇందులో ఆయన అభిమానులను ఉద్దేశిస్తూ.. వారికి కొన్ని సూచనలు చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయి.. మధ్యంతర బెయిల్‌తో విడుదలైన విషయం తెలిసిందే. శనివారం తెలంగాణ అసెంబ్లీలో అల్లు అర్జున్‌‌పై సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయగా.. వాటికి వివరణ ఇచ్చేందుకు శనివారం సాయంత్రం అల్లు అర్జున్ తన ఇంటి దగ్గర మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలన్నీ తప్పుడు ఆరోపణలు అంటూ ఇన్‌డైరెక్ట్‌గా అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

అల్లు అర్జున్ మీడియా సమావేశం అనంతరం.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలను షేర్ చేస్తూ.. అల్లు అర్జున్‌ని టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. అలాంటి వాళ్లందరికీ అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నట్లుగా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు వారిని మరింత రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తుండటంతో.. వ్యవహారం శృతిమించే స్థాయికి పోతుందని గమనించిన అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు ఓ సూచన చేశారు.


‘‘నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయవద్దని విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేర్ ఐడీ, ఫేక్ ప్రొఫైల్స్‌తో పోస్ట్‌లు వేస్తున్న వారిపై తీవ్రంగా చర్యలు తీసుకోబడతాయి. నెగిటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని నా ఫ్యాన్స్‌కు సూచిస్తున్నాను’’ అని అల్లు అర్జున్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అభిమానులందరూ బాధ్యతాయుతంగా ఉండాలని అల్లు అర్జున్ కోరారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. సెలబ్రిటీలు అయినంత మాత్రాన ప్రజల ప్రాణాలు తీస్తామంటే ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తను సీఎంగా ఉన్నంత వరకు సినిమా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్‌ షోలు ఉండవని సీఎం స్పష్టం చేశారు.

Also Read-అల్లు అర్జున్ కాలు విరిగిందా? చెయ్యి విరిగిందా?: సీఎం రేవంత్

Also Read-Sandhya Theatre Stampede: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Also Read-UI Movie Review : ఉపేంద్ర నటించిన UI మూవీ ఎలా ఉందంటే..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 22 , 2024 | 04:28 PM