అందరి పేర్లు బయటపెట్టాలి
ABN , Publish Date - Aug 29 , 2024 | 04:23 AM
మలయాళ చిత్ర ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఎఫ్‌ఈఎ్‌ఫకేఏ (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ) దర్శకుల సంఘం ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది...
మలయాళ చిత్ర ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఎఫ్‌ఈఎ్‌ఫకేఏ (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ) దర్శకుల సంఘం ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది. జస్టిస్ హేమ కమిటీ నివేదికలో లైంగిక వేధింపులకు పాల్పడిన అందరి పేర్లను బయట పెట్టాలంటూ ఎఫ్‌ఈఎ్‌ఫకేఎ దర్శకుల సంఘం డిమాండ్ చేసింది. ‘‘ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉన్నందున దీనిపై ఎక్కువ మాట్లాడాలనుకోవడం లేదు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ అందరి పేర్లు బయటకి రావాలి. దోషులకు కఠిన శిక్ష పడాలి. నిందితులలో మా సంఘం సభ్యులున్నా.. మేం కలుగజేసుకోం’’ అని పేర్కొంది.
సిద్ధిఖీపై కేసు
మలయాళ నటుడు సిద్థిఖీపై నటి రేవతి సంపత్ లైంగిక ఆరోపణల నేపథ్యంలో సిద్ధిఖీపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. అలాగే, బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర చేసిన ఆరోపణల నేపథ్యంలో దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలుగు ఇండస్ట్రీలో మరీ ఎక్కువ
నటి షకీలా తెలుగు, తమిళ ఇండస్ట్రీలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘లైంగిక వేధింపులు కేవలం మలయాళ చిత్రసీమలోనే కాదు.. తమిళ ఇండస్ట్రీలోనూ ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీలో అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి.
అడ్జస్ట్‌మెంట్లు, కమిట్‌మెంట్ల గురించి మేనేజర్లు ముందే అడుగుతారు’’ అని ఆరోపించారు.
నోరు విప్పితే ట్రబుల్‌మేకర్స్ ముద్ర
హేమ కమిటీ రిపోర్ట్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ నటి స్వర భాస్కర్. ‘‘హేమ కమిటీలో వెలువడిన చీకటి వాస్తవాలు చూసి షాకయ్యా. బాధితులు ఎవరైనా ఏ విషయంపై అయినా నోరు తెరచి మాట్లాడితే వారిని ట్రబుల్‌మేకర్స్‌గా ముద్ర వేస్తారు’’ అని స్వర భాస్కర్ పేర్కొన్నారు. ప్రతి పరిశ్రమలోనూ మహిళలు ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారని నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ అన్నారు. వేధింపులను వెలుగులోకి తెచ్చేందుకు హేమ కమిటీ రిపోర్ట్ ఉపయోగపడిందన్నారు. ఈ నివేదిక మనలో మార్పు తీసుకురావాలి అని ఆమె ఆకాంక్షించారు.