Renu Desai: మంత్రి కొండా సురేఖతో నటి రేణు దేశాయ్ భేటీ..

ABN , Publish Date - Jul 26 , 2024 | 08:27 PM

ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ శుక్రవారం జూబ్లిహిల్స్‌లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖని వారింట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు.

ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ (Film actress, Bhagavad Gita Foundation for Vedic Studies Chief Advisor Renu Desai) శుక్రవారం జూబ్లిహిల్స్‌లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha)ని వారింట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీ (Gita University)కి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ మంత్రి కొండా సురేఖకి వివరించారు.

Also Read- Raayan Review: రాయన్  రివ్యూ.. ధనుష్ 50వ చిత్రం ఎలా ఉందంటే.. 


Renu-Desai.jpg

ఈ సందర్భంగా తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణుదేశాయ్‌ (Renu Desai)ని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని మంత్రి సురేఖ.. రేణు దేశాయ్‌కి తన స్వహస్తాలతో అలంకరించారు.

Renu-Desai-4.jpg

కొండా కుటుంబం తనను ఆదరించిన తీరు పట్ల రేణు దేశాయ్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

Renu-Desai-3.jpg


రేణు దేశాయ్ విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో విడాకుల అనంతరం తన ఇద్దరి పిల్లరి బాగోగులు చూసుకుంటూ.. సోషల్ సర్వీస్‌పై ఆమె దృష్టి పెట్టారు. రైతుల గురించి, ఇంకా యానిమల్స్, చిన్నపిల్లల ఫుడ్ కోసం ఆమె కొంత అమౌంట్ డొనేట్ చేస్తూనే.. సోషల్ మీడియా ఫాలోయర్స్‌ని కూడా ఈ సర్వీస్‌లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్‌గా ఆమె ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టుబోతున్నట్లుగా తెలుస్తోంది.

Renu-desai-2.jpg

Read Latest Cinema News

Updated Date - Jul 26 , 2024 | 10:01 PM