Actress Hema: కొండా సురేఖ కామెంట్స్‌పై హేమ ఎలా రియాక్ట్ అయ్యారంటే..
ABN , Publish Date - Oct 02 , 2024 | 07:40 PM
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆరోపణలు గుప్పిస్తూ.. సినిమా ఇండస్ట్రీలోని కొందరు హీరోయిన్ల పేర్లను మంత్రి కొండా సురేఖ ప్రస్తావించిన విషయం తెలిసిందే. అలాగే ఆమె చేసిన వ్యాఖ్యలపై కూడా సినీ ఇండస్ట్రీని నుంచి ఖండన మొదలైంది. తాజాగా కొందరు సెలబ్రిటీలు కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. సెలబ్రిటీలు ఏమన్నారంటే..
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై ఆరోపణలు గుప్పిస్తూ.. సినిమా ఇండస్ట్రీలోని కొందరు హీరోయిన్ల పేర్లను మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ప్రస్తావించిన విషయం తెలిసిందే. అలాగే అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి కూడా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ తాజాగా అక్కినేని నాగార్జున ట్విట్టర్ వేదికగా మంత్రి కొండా సురేఖను కోరుతూ.. ఆమె వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతకు ముందు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ట్విట్టర్ వేదికగా.. కొండా సురేఖ కామెంట్స్‌పై స్పందించారు. తాజాగా నటి హేమ ట్విట్టర్ వేదికగా కొండా సురేఖ కామెంట్స్‌పై స్పందించారు. హేమ ఏమన్నారంటే..
Also Read- King Nagarjuna: వెనక్కి తీసుకోండి.. కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై నాగార్జున
‘‘సినిమా రంగంలో ఉన్న ఆడవారికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది. మిగతా రంగాల్లో పనిచేసే ఆడవారికి ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తున్నారో.. ఆత్మగౌరవాన్ని ఇస్తున్నారో అలాగే సినిమా ఆడవారికి కూడా గౌరవం ఇవ్వండి’’ అంటూ హేమ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌కు ఆమె మంత్రి కొండా సురేఖను, కింగ్ నాగార్జునను, ‘మా’ను, ప్రకాశ్ రాజ్‌ను, సమంతను ట్యాగ్ చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై సినిమా ఇండస్ట్రీ నుండి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నెటిజన్లు కూడా అంత పబ్లిగ్గా అలా ఎలా అనేస్తారు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే భయటపెట్టి అప్పుడు మాట్లాడండి కానీ.. ఇలా లేనిపోని ఆరోపణలను చేసి.. సెలబ్రిటీల పరువును సోషల్ మీడియాలో పెట్టవద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read- Konda Surekha: చైతూ-సమంత విడాకులు, రకుల్ హడావుడి పెళ్లి.. కారణం కేటీఆరే..
కొండా సురేఖ వివాదస్పద కామెంట్స్‌పై సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు రియాక్ట్ అయ్యారంటే..
‘‘గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను.’’ - కింగ్ నాగార్జున
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప ?.. - ప్రకాశ్ రాజ్
‘‘సినిమా రంగంలో ఉన్న ఆడవారికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది. మిగతా రంగాల్లో పనిచేసే ఆడవారికి ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తున్నారో.. ఆత్మగౌరవాన్ని ఇస్తున్నారో అలాగే సినిమా ఆడవారికి కూడా గౌరవం ఇవ్వండి’’. - నటి హేమ
‘‘అక్కినేని నాగార్జునగారి కుటుంబంపై తెలంగాణ కేబినెట్ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలకు నేను షాక్ అయ్యాను. నేను ఆమె ప్రతి మాటను తీవ్రంగా ఖండిస్తున్నాను మరియు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని అభ్యర్థిస్తున్నాను. నేను ఎంతో గౌరవించే మీరు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, సినీ ఇండస్ట్రీలోని మహిళలపై ఆమె చేసిన బాధ్యతారహితమైన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పించాలని కోరుతున్నాను. ఇది ఖచ్చితంగా ఒక చెడ్డ ఉదాహరణగా మిగిలిపోతుంది. అలాగే సినీ ఇండస్ట్రీకి చెందిన వారంతా మంత్రి కొండా సురేఖ చేసిన అర్థం పర్థంలేని కామెంట్స్‌ని ఖండించాల్సిందిగా కోరుతున్నాను’’ - కోన వెంకట్