రాజ్‌తరుణ్ ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్
ABN , Publish Date - Jul 16 , 2024 | 04:53 AM
రాజ్‌తరుణ్, లావణ్య, హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఎపిసోడ్ సోమవారం సరికొత్త మలుపు తిరిగింది. ఈ ఎపిసోడ్‌లోకి కొత్త పాత్ర ఎంటర్ అయింది. తన కుమారుణ్ని ట్రాప్ చేసి, మాల్వీ ఆస్తి కాజేసిందని ముంబై నిర్మాత యోగేశ్ తల్లి...
రాజ్‌తరుణ్, లావణ్య, హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఎపిసోడ్ సోమవారం సరికొత్త మలుపు తిరిగింది. ఈ ఎపిసోడ్‌లోకి కొత్త పాత్ర ఎంటర్ అయింది. తన కుమారుణ్ని ట్రాప్ చేసి, మాల్వీ ఆస్తి కాజేసిందని ముంబై నిర్మాత యోగేశ్ తల్లి సంచలన ఆరోపణలు చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. యాగేశ్, మాల్వీ కాల్ లిస్ట్‌ను కూడా ఆమె బయట పెట్టారు. ఆమె వెల్లడించిన సమాచారం ప్రకారం యోగేశ్ ముంబైలో ఓ చిన్న నిర్మాత. తన చిత్రంలో నటించడానికి వచ్చిన మాల్వీతో ప్రేమలో పడ్డారు యోగేశ్. వీళ్లిద్దరూ రెండేళ్లు సహజీవనం కూడా చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో, తనని పెళ్లి చేసుకోవడానికి యోగేశ్ నిరాకరించాడనీ, కత్తితో తనపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించాడనీ ఆరోపిస్తూ మాల్వీ కేసు పెట్టడంతో యోగేశ్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగేళ్లుగా మాల్వీ తమ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతోందని, తప్పుడు కేసులు పెట్టి తన కుమారుడిని జైలుకి పంపించిందని యోగేశ్ తల్లి వెల్లడించారు.
రాజ్‌తరుణ్, లావణ్య కేసులో మాల్వీ ఇన్‌వాల్వ్ అయిన విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నాననీ, అందుకే మాల్వీ బండారం బయటపెట్లాలని వీడియో విడుదల చేస్తున్నాననీ, తన కొడుకు ఇంకా జైలులోనే ఉన్నాడనీ, మాల్వీ అతని కెరీర్‌ను సర్వనాశనం చేసిందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు యోగేశ్ తల్లి.