OTT: ఓటీటీని షేక్ చేస్తున్న.. టాప్ 10 కొరియన్ మూవీస్ ఇవే! అన్నీ తెలుగులోనే (పార్ట్ 1)
ABN , Publish Date - Jan 09 , 2024 | 04:37 PM
మనలో చాలా మందికి తెలుగు డబ్బింగ్ సినిమాలు ఎప్పుడొస్తాయా అని చూసే వారు రోజురోజుకు అధికమవుతున్నారు. ఏదైనా హలీవుడ్, చైనీస్, కొరియన్ సినిమా ఓటీటీలోకి వస్తే వెంటనే అది తెలుగులో ఉందా లేదా అనే ఫస్ట్ చూస్తుంటారు. అలాంటి వారి కోసమే ప్రస్తుతం ఓటీటీలో దుమ్ము రేపుతున్న పది ముఖ్యమైన కొరియన్ చిత్రాల విశేషాలను మీకు అందించడం జరుగుతుంది.

నిత్యం ఓటీటీలోకి చాలా సినిమాలు వస్తుంటాయ్, పోతుంటాయ్. అందులో కొన్నింటినీ మనం ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యామనే భావన వస్తుంది. ముఖ్యంగా మనలో చాలా మందికి తెలుగు డబ్బింగ్ సినిమాలు ఎప్పుడొస్తాయా అని చూసే వారు రోజురోజుకు అధికమవుతున్నారు. ఏదైనా హలీవుడ్, చైనీస్, కొరియన్ సినిమా ఓటీటీలోకి వస్తే వెంటనే అది తెలుగులో ఉందా లేదా అనే ఫస్ట్ చూస్తుంటారు.
అలాంటి వారి కోసమే ప్రస్తుతం ఓటీటీలో దుమ్ము రేపుతున్న పది ముఖ్యమైన కొరియన్ చిత్రాల విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి నచ్చిన వారు ఈ సెలవుల్లో వీటిని మిస్సవకుండా చూసేయండి.
మిడ్ నైట్ (Midnight):
2021లో విడుదలైన దక్షిణ కొరియా సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. ఓ సైకో కిల్లర్ మర్డర్ చేయడాన్ని ఓ చెవిటి, మూగ అమ్మాయి చూస్తుంది. ఇది గమనించిన కిల్లర్ అ అమ్మాయిని చంపేందుకు ప్రయత్నాలు చేయడం, అ అమ్మాయి,తన తల్లితో కలిసి కిల్లర్ నుంచి ఎలా తప్పించుకుంటూ పోరాడిందనే కథతో సినిమా మొదటి నుంచి చివరి వరకు సస్పెన్స్‌తో నడిచి చూసే ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా థ్రిల్లింగ్ కలుగజేస్తుంది.
ది మూన్ (The Moon):
కొరియన్ స్పేస్ అడ్వెంచర్ సర్వైవల్ డిజాస్టర్ జానర్‌లో వచ్చిన చిత్రం ది మూన్ . సౌత్ కొరియా దేశం చంద్రునిపైకి ఓ వ్యోమగామిని పంపగా సౌర తుఫాను వల్ల అంతరిక్షంలో చిక్కుకుపోతాడు. అతనిని సురక్షితంగా భూమి మీదకు తీసుకురావడానికి స్పేస్ సెంటర్ చేసే ప్రయత్నాలతో ఆద్యంతం సినిమా ఆసక్తికరంగా మలీవుడ్ సినిమా చూసే ఫీలింగ్‌ను ఇస్తుంది.
ఐ సాది డెవిల్ (I Saw the Devil):
ఈ చిత్రం 2010లో కొరియాలో విడుదలై సంచలనం సృష్టించింది. డార్క్, యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ సినిమా ఇది ఇప్పటి వరకు మనం చూసిన చిత్రాల కన్నా చాలా భిన్నమైనది. తన భార్యను చంపిన సీరియల్ కిల్లర్‌ను హీరో ఎలా టార్గెట్ చేసి, చిత్రహింసలు పెట్టి చంపాడనే కథ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. 2 గంటల 22 నిమిషాల నిడివితో ఉన్న ఈ చిత్రంలో అక్కడక్కడ బోల్డ్ సీన్లు మనల్ని కాస్త డిస్ట్రబ్ చేసినా సినిమా చివరి వరకు సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది.
ఓల్డ్ బాయ్ (OLDBOY):
20 ఏండ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ కొరియన్ సినిమాల చరిత్రలో ఓ మాస్టర్ పీస్. రెండు గంటల 3 నిమిషాల నిడివితో సాగే ఈ రివేంజ్ డ్రామా స్లోగా సాగినా క్లైమాక్స్ మన మైండ్‌ని బ్లాంక్ చేస్తుంది. డెసావు అనే వ్యక్తి 15 యేండ్ల తర్వాత కిడ్నాపర్ల చెర నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చాక , ఎవరు, ఎందుకు బంధించారనే కారణాలతో ప్రతికారం తీర్చుకోవాలని రగిలిపోతూ తనను కిడ్నాప్ చేసిన వారిని, తన కూతురుని వెతుకుతుంటాడు.
ఈక్రమంలో తన కూతురిని, కిడ్నాపర్స్‌ని కనిపెట్టాడా లేదా, ఎందుకు తనని కిడ్నాప్ చేశారో తెలుసుకుని చివరకు ఏం చేశాడనే ఇతివృత్తంతో సస్పెన్స్‌తో, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కించారు. అయితే సినిమా చివరలో రివీల్ అయే సీక్రెట్స్, ఫ్రీ క్లైమాక్స్ సీన్స్ మనల్ని ఓ రేంజ్‌లో డిస్ట్రబ్ చేస్తాయి. సినిమా చూసిన రెండు మూడు రోజుల తర్వాతకు గానీ మనం ఇందులో నుంచి బయటపడలేం. సో ఈ సినిమాను మాత్రం మీరు ఆలోచించి చూడడం చాలా బెటర్.
ఎస్కేప్ ఫ్రం మొగదిషు (Escape from Mogadishu):
2021లో వచ్చిన ఈ పొలిటికల్,యాక్షన్ థ్రిల్లర్ సినిమాను 1991 సోమాలియా సివిల్ వార్ నేపథ్యంలో నిజ జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్లను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. యుద్ధం నేపథ్యంలో సోమాలియాలో చిక్కుకున్న కొరియన్ ఎంబసీ ఉద్యోగులు ఎలా తప్పించుకున్నారు, సురక్షితంగా వారి దేశానికి ఎలా వెళ్లారనే కథతో సస్పెన్స్, ఎమోషనల్ సన్నివేశాలతో ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించారు.
ప్రాజెక్ట్ ఉల్ఫ్ హంటింగ్ (Project Wolf Hunting):
2022 దక్షిణ కొరియా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ హారర్ చిత్రం. ఫిలిప్పీన్స్‌లోని మనీలా నుంచి దక్షిణ కొరియాలోని బుసాన్‌కు కొంతమంది ప్రమాదకరమైన నేరస్థులను కార్గో షిప్‌లో తరలిస్తున్న సమయంలో వారంతా కలిసి నౌకలోని సిబ్బంది, పోలీసులపై ఎదురు దాడికి దిగుతారు. అయితే ఓడలో రహస్యంగా ఉన్న ఓ క్రీచర్ బయటకు వచ్చి కనిపిచ్చిన ప్రతి ఒక్కరిని క్రూరంగా చంపుకుంటూ వెళుతుంది. ఈ క్రమంలో ఓడలోనే ఉన్న హీరో అతని స్నేహితులు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు, క్రిమినల్స్‌తో ఎలా పోరాడారనే నేపథ్యంలో ఔట్ అండం ఔట్ హింసాత్మక సీన్లు,యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం ఉంటుంది. రూపొందింది.
హన్సన్ (రైజింగ్ డ్రాగన్)Hansan: Rising Dragon:
2022లో విడుదలైన ఈ పిరియాడికల్,యాక్షన్ చిత్రం 2014లో వచ్చిన ది అడ్మిరల్‌కు ఫ్రీ క్వెల్. కుదిరితే ఈ అడ్మిరల్ సినిమా చూస్తే ఈ సినిమా అర్ధం అవుతుంది. మియోంగ్‌న్యాంగ్ యుద్ధానికి ఐదు సంవత్సరాల ముందు జరిగిన చారిత్రాత్మక హన్సన్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా రూపొందించగా ఇందులో పోరాట సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు. చూసే ప్రేక్షకులకు ఎపిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ కొరియన్ చిత్రంగా ఈ సినిమా రికార్డులకెక్కింది.
ది వెయిలింగ్ (The Wailing):
2016లో విడుదలైన ఈ హర్రర్ చిత్రం మనల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. మనం దేశంలో ఉన్నట్లే కొరియా పల్లెటూర్లలో జరిగే క్షుద్ర పూజలు, సీరియల్ కిల్లింగ్స్ నేపథ్యంలో ఓళ్లు గగుర్పొడిచేలా, భయంకరంగా ఉంటాయి. ఊర్లో జరిగే వరుస హత్యలు, చేతబడికి గురైన తన కూతురిని రక్షించడం కోసం ఓ పోలీసు చేసే పోరాటం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం భయపెట్టడం మాత్రం ఖాయం.
ట్రైన్ టూ బూసాన్ (Train To Busan):
2016లో వచ్చిన దక్షిణ కొరియా యాక్షన్ హారర్ చిత్రం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రూపొందింది. దేశంలో అకస్మాత్తుగా జోంబీలు పుట్టుకువచ్చి దాడులు చేస్తుంటారు. ఈ క్రమంలో హీరో తన కూతురుని తీసుకుని సియోల్ నుంచి బుసాన్ వరకు ఓ రైలులో వెళ్తున్న క్రమంలో జోంబీలు దాడి చేస్తారు. వారి నుంచి హీరో తన కూతురిని ఎలా కాపాడుకున్నాడనే కథతో, స్టన్నింగ్ విజువల్స్‌తో సినిమాను తీశారు.
ఎమర్జెన్సీ డిక్లరేషన్ (Emergency Declaration ):
2021లో వచ్చిన దక్షిణ కొరియా డిజాస్టర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాలో ఫ్లైట్‌లో ఉగ్రవాదులు ఎటాక్ చేయడంతో వెంటనే ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ బయటి నుంచి అందకు పర్మిషన్ రాక పోవడంతో విమానంలోని వారు ఏం చేశారు, ఎలా బయట పడ్డారనే కథ నేపథ్యంలో సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది.