Oppenheimer అప్పుడు గోల్డెన్ గ్లోబ్.. ఇప్పుడు బాఫ్టా..!
ABN , Publish Date - Feb 19 , 2024 | 10:00 AM
ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ‘ఓపెన్‌హైమర్’ చిత్రం బాఫ్టా (బిటిష్ అకాడమీ ఫిల్మ్) అవార్డుల్లో సత్తా చాటింది. లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో 77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డు ప్రదానోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది.
ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ‘ఓపెన్‌హైమర్’ చిత్రం బాఫ్టా (బిటిష్ అకాడమీ ఫిల్మ్) అవార్డుల్లో సత్తా చాటింది. లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో 77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డు ప్రదానోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఉత్తమ చిత్రం తో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ బ్యాగ్రౌండ్ స్కోర్ సహా మొత్తం ఏడు విభాగాల్లో పురస్కారాలు ఈ చిత్రాన్ని వరించాయి. క్రిస్టోఫర్ నోలన్‌కు దర్శకుడిగా దక్కిన తొలి బాఫ్టా అవార్డ్ ఇది. ఇప్పటికే అత్యధిక గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్న ‘ఓపెన్‌హైమర్’ వచ్చే నెల జరిగే ఆస్కార్ రేసులో తన స్థ్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ చిత్రంలోపాటు ‘పూర్ థింగ్స్’కు అయిదు, ‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’కు మూడు పురస్కారాలు దక్కాయి.
బాఫ్తా విన్నర్స్ వీరే..
ఉత్తమ చిత్రం - ఓపెన్‌హైమర్
ఉత్తమ దర్శకుడు - క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ నటుడు - సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ నటి - ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ సహాయ నటుడు - రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ సహాయ నటి - డావిన్ జాయ్ రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్)
ఉత్తమ మేకప్ - నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ - సైమన్ హ్యూస్
ఉత్తమ సౌండ్ - జానీ బర్న్, టార్న్ విల్లర్స్ (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్)
ఉత్తమ స్కోర్ - లుడ్విగ్ గోరాన్సన్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ - హోట్ వాన్ హోటిమా (ఓపెన్‌హైమర్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే - జస్టిన్ ట్రైట్, ఆర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఫాల్)
ఉత్తమ డాక్యుమెంటరీ - 20 డేస్ ఇన్ మరియోపోల్
ఉత్తమ క్యాస్టింగ్ - ది హోల్డోవర్స్
ఉత్తమ ఎడిటింగ్ - జెన్నీఫర్ లేమ్ (ఓపెన్‌హైమర్)