Priyanka Chopra: పాత్ర కోసం దెబ్బలు తినాల్సిందే!
ABN , Publish Date - Jun 22 , 2024 | 11:26 AM
సినిమాలో ఓ పాత్ర అంగీకరిస్తే దానికి వంద శాతం న్యాయం చేయడానికి కసరత్తులు చేస్తుంటారు నాయికలు. ఆ పాత్ర ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోవాలనుకుంటారు.
సినిమాలో ఓ పాత్ర అంగీకరిస్తే దానికి వంద శాతం న్యాయం చేయడానికి కసరత్తులు చేస్తుంటారు నాయికలు. ఆ పాత్ర ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోవాలనుకుంటారు. ఆ పాత్రతో ట్రావెల్ చేస్తూ.. షూటింగ్ అయ్యే దాకా ఆ పాత్రలో ఉండిపోతారు. పాత్ర పండటం కోసం అంతగా కష్టపడుతుంటారు. అలాంటి ఓ యాక్షన్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా (Priyanka chopra) శారీరకంగా ఎంతో కష్టపడుతోంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న ‘ది బ్లఫ్’ (The bluff) ఫ్రాంక్ ఇ.ఫ్లవర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆరేస్టలియాలో చిత్రీకరణను మొదలైంది. ప్రియాంకపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కీలకమైన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నారు ప్రియాంక.
ఈ నేపథ్యంలో ప్రియాంకకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సంబంధిత ఫొటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంది. ‘యాక్షన్ సినిమాలు చేస్తున్నప్పుడు కూడా గ్లామర్ కనిపిస్తాం. షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఫేక్ బ్లడ్ వాడొచ్చు కానీ.. తెలియకుండానే కొన్ని గాయాలు అవుతుంటాయి. అవి మాత్రం ఫేక్ కాదు’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే సెట్‌లో జరుగుతున్న వర్క్ విశేషాలను కూడా పోస్ట్ చేశారు. తన కూతురు మాల్తీ కూడా సెట్‌లోనే ఉన్నారు. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఓ మహిళ చేసిన పోరాట నేపథ్యంలో ఈ చిత్రం రానుంది. ఏజీబీఓ పతాకంపై ఇంగ్లిష్‌లో నిర్మితమవుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.