OTT - Mission impossible 7: తాళాల కోసం సీక్రెట్‌ ఏజెంట్‌ ఈథన్ ఏం  చేశాడు! 

ABN , Publish Date - Jan 06 , 2024 | 10:08 AM

హాలీవుడ్‌ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ (mission impossible-7)సిరీస్‌ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే! ఆ ఫ్రాంచైజీలో ఆఖరి చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’. ‘డెడ్‌ రెకొనింగ్‌: పార్ట్‌ 1’ పేరుతో గతేడాది జూన్‌లో థియేటర్లలో విడుదలై, ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా  స్ట్రీమింగ్‌ (OTT) కావడానికి రెడీ అయింది

OTT - Mission impossible 7: తాళాల కోసం సీక్రెట్‌ ఏజెంట్‌ ఈథన్ ఏం  చేశాడు! 

హాలీవుడ్‌ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ (mission impossible-7)సిరీస్‌ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే! ఆ ఫ్రాంచైజీలో ఆఖరి చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’. ‘డెడ్‌ రెకొనింగ్‌: పార్ట్‌ 1’ పేరుతో గతేడాది జూన్‌లో థియేటర్లలో విడుదలై, ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా  స్ట్రీమింగ్‌ (OTT) కావడానికి రెడీ అయింది. తాజాగా విడుదల తేదీ ఖరారు అయింది. జనవరి 11 నుంచి అమెజాన్  ప్రైమ్‌ వీడియోలో (Amazon Prime video) ఈ చిత్రం సందడి చేయనుంది. తెలుగు  ఆడియో కూడా అందుబాటులో ఉంటుందని సదరు సంస్థ సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. అక్టోబరులో రెంటల్‌ బేస్‌ మీద ఓటీటీలో స్ట్రీమింగ్‌  అయిన సంగతి తెలిసిందే! జనవరి 11 నుంచి రెంట్‌ లేకుండా చూడొచ్చని సదరు సంస్థ పేర్కొంది. 

కథ:

సముద్రంలో శత్రు దేశాల రాడార్‌లకూ చిక్కకుండా తిరిగే సామర్థ్యం కలిగిన సబ్‌మెరైన్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ‘ది ఎంటిటీ’ సోర్స్‌ కోడ్‌ ఉంటుంది. రెండు ‘కీ’లను కలిపి ఒకటిగా చేసి మాత్రమే దాన్ని అన్‌లాక్‌ చేసి, నియంత్రించగలరు. అనుకోని పరిస్థితుల్లో ఆ సబ్‌మెరైన్‌ పేలిపోయి మునిగిపోతుంది. అందులోని వారందరూ చనిపోతారు. ఆ రెండు ‘కీ’లు సముద్రంలో నుంచి మాయం అవుతాయి. వాటిని దక్కించుకుని ‘ది ఎంటిటీ’ని నియంత్రించగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తిని సొంతం చేసుకోవచ్చు. ఏ టెక్నాలజీనైనా సులభంగా హ్యాక్‌ చేయవచ్చు. ఆ కీ  చేజిక్కించుకుని, ఈ ప్రపంచాన్ని శాసించాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. ఆ తాళాలు వారి చేతిలో పడకుండా   కాపాడే బాధ్యతను మిషన్‌ ఇంపాజిబుల్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ ఈథన్‌ హంట్‌ (టామ్‌ క్రూజ్‌)కు అప్పగిస్తారు.  మరి, ఆ తాళాల కోసం ఈథన్‌ హంట్‌ చేసిన సాహసం ఏంటి? ఆ తరుణంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి. కంటికి కనిపించని శత్రువుతో ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కొన్నాడు? అనేది ఇతివృత్తం. 


Updated Date - Jan 06 , 2024 | 10:41 AM