Thunder Bolts Trailer: మార్వెల్ మ‌రో సూప‌ర్ హీరోస్ సినిమా.. ‘థండ‌ర్ బోల్ట్స్’ ట్రైలర్ అదిరింది

ABN , Publish Date - Sep 24 , 2024 | 04:44 PM

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత మార్వెల్ స్టూడియోస్ నుంచి మ‌రో ఇంట్రెస్టింగ్ సూప‌ర్ హీరోస్‌ చిత్రం థండ‌ర్ బోల్ట్స్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు.

Thunder Bolts

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత మార్వెల్ స్టూడియోస్ (Marvel Studios) నుంచి మ‌రో ఇంట్రెస్టింగ్ సూప‌ర్ హీరోస్‌ చిత్రం థండ‌ర్ బోల్ట్స్ (Thunder Bolts) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌గా భారీ వ్యూస్ ద‌క్కించుకుంటోంది. సినిమాపై అంచ‌నాల‌ను రెట్టింపు చేస్తోంది.

ఫ్లోరెన్స్ పగ్ (Florence Pugh), డేవిడ్ హార్బర్ (David Harbour), హన్నా జాన్-కామెన్, సెబాస్టియన్ స్టాన్, వ్యాట్ రస్సెల్, గెరాల్డిన్ విశ్వనాథన్, లూయిస్ పుల్మాన్, ఓల్గా కురిలెంకో వంటి పేరున్న‌ న‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా జేక్ స్క్రీయర్ (Jake Schreier) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వాల్ట్ డిస్నీ (Walt Disney Studios)తో క‌లిసి మార్వెల్ స్టూడియో (Marvel Studios) ఈ సినిమాను నిర్మించింది. మే, 2025లో థియేట‌ర్ల‌లోకి రానుంది.

Updated Date - Sep 24 , 2024 | 04:44 PM