Twisters: హాలీవుడ్ ల‌వ‌ర్స్ గెట్ రెడీ.. సుడిగుండం వ‌చ్చేస్తోంది! థ్రిల్లే థ్రిల్లు

ABN , Publish Date - Jul 17 , 2024 | 09:22 PM

ఈ వారం ఓ ఇంట్రెస్టింగ్ అమెరిక‌న్ డిజాస్ట‌ర్‌ హాలీవుడ్ చిత్రం ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు వ‌స్తోంది. అప్పుడెప్పుడో 1996లో వ‌చ్చిన ట్విస్ట‌ర్ చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కిన ట్విస్ట‌ర్స్ మ‌రో రోజులో థియేట‌ర్ల‌లోకి రానుంది.

twisters

ఎప్ప‌టిలానే ఈ వారం ఓ ఇంట్రెస్టింగ్ అమెరిక‌న్ డిజాస్ట‌ర్‌ హాలీవుడ్ చిత్రం ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు వ‌స్తోంది. అప్పుడెప్పుడో 1996లో వ‌చ్చిన ట్విస్ట‌ర్ (Twister) చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కిన ట్విస్ట‌ర్స్ (Twisters) అనే మూవీ మ‌రో రోజులో థియేట‌ర్ల‌లోకి రానుంది. గ‌తంలో వ‌చ్చిన చిత్రం రూ. వంద‌ల కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబట్టి సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో ఇప్పుడు విడుద‌ల కాబోతున్న చిత్రంపై అంచ‌నాలు రెండింత‌లు రెట్టింప‌య్యాయి.

GSIpPzcaYAAHSMY.jpeg

డైసీ ఎడ్గ‌ర్ జోన్స్ (Daisy Edgar-Jones), గ్లెన్ పావెల్ (Glen Powell), అంటోని ర‌మోస్ (Anthony Ramos), బ్రాండెన్ పెరియా (Brandon Perea), మౌరా టియ‌ర్నీ (Maura Tierney), సాషా లేన్ (Sasha Lane) వంటి న‌టులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. లీ ఐజాక్‌ చుంగ్ (Lee Isaac Chung) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్ప‌టికే లండ‌న్‌లో విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. జూలై 18న ప్ర‌పంచమంతా విడుద‌ల కానుంది. మ‌న దేశంలో కేవ‌లం ఇంగ్లీష్‌, హిందీ భాష‌ల‌లో మాత్ర‌మే ఈ ట్విస్ట‌ర్స్ (Twisters) సినిమాను రిలీజ్ చేస్తున్నారు.


GSIpMG1bAAAtS2K.jpeg

క‌థా నేప‌థ్యం విష‌యానికి వ‌స్తే.. ఫ్రెండ్ జేవి అభ్య‌ర్ధ‌న‌తో కొత్త‌గా నిర్మించిన వెద‌ర్ ట్రాకింగ్ సిస్ట‌మ్‌ను ప‌రీక్షించ‌డానికి మెట్రోలోజిస్ట్ స్పెష‌ళిస్ట్ కూప‌ర్ అమెరికాలోని ఓక్లోహోమాకు వ‌స్తుంది. త‌ర్వాత తుఫాన్ సీజ‌న్ వ‌చ్చేయ‌డంతో తీవ్ర‌మైన స్థాయిలో సుడిగుండాలు వ‌చ్చి అన్నీ స‌ర్వ‌నాశ‌నం అవుతుంటాయి. ఈక్ర‌మంలో క‌థానాయిక‌, త‌న మిత్రులు సుడిగుండాల నుంచి త‌ప్పించుకోగ‌లిగారా, ప్ర‌జ‌ల‌ను కాపాడా గ‌లిగారా అనే ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతూ ప్రేక్ష‌కుల‌ను సీట్ ఎడ్జ్ లో కూర్చోబుడుతుంది.

GSIpMGwaUAMe0Jn.jpeg

ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌ను చూస్తే ప్ర‌జ‌ల‌కు సినిమా ఏ రేంజ్‌లో ఉండ‌బోతుందో ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. అంత‌కుముందు వ‌చ్చిన సినిమాల‌ను త‌ల‌ద‌న్నే విజువ‌ల్స్‌, గ్రాఫిక్స్‌, థ్రిల్లింగ్ స‌న్నివేశాల‌తో సినిమాను తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం సినిమాపై పాజిటివ్ రిపోర్ట్స్‌ కూడా వ‌స్తున్నాయి సో ఈ వీకెండ్ ఈ సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లో మిస్ కాకుండా మీ వాచింగ్ లిస్టులో యాడ్ చేసుకోండి. థియేట‌ర్ల‌లో ట్విస్ట‌ర్స్ (Twisters సినిమా చూసి ఎంజాయ్ చేయండి.

GSrzPg2WIAIXNCL.jpeg

Updated Date - Jul 18 , 2024 | 11:02 PM