I Robot Vs Elon Musk: మస్క్.. నా సినిమా రోబోల‌ను కాపీ చేశాడు

ABN , Publish Date - Oct 16 , 2024 | 06:31 PM

ఎలాన్ మస్క్ గత వారం టెస్లా ఈవెంట్‌లో ఆప్టిమస్ రోబోట్‌లను ఆవిష్కరించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఈవెంట్ చిత్రాలు, వీడియోలపై గ‌తంలో ఐ రోబోట్ అనే మూవీని తెర‌కెక్కించిన‌ డైరెక్టర్ అలెక్స్ ప్రోయాస్ స్పందించాడు.

musk

ఎలాన్ మస్క్ ( Elon Musk) గత వారం టెస్లా ఈవెంట్‌లో ఆప్టిమస్ రోబోట్‌లను ఆవిష్కరించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో సైబర్‌ క్యాబ్‌లతో పాటు డ్రైవర్‌లెస్ రోబో వాన్‌లను కూడా ఆవిష్కరించాడు. ఈ న్యూస్ ప్ర‌పంచ‌మంత‌టా బాగా వైర‌ల్ అయింది కూడా. కాగా.. ఈ ఈవెంట్ యొక్క చిత్రాలు మరియు వీడియోలపై గ‌తంలో ఐ రోబోట్ (I Robot) అనే సెన్స్‌ఫిక్స‌న్ మూవీని తెర‌కెక్కించిన‌ డైరెక్టర్ అలెక్స్ ప్రోయాస్ (Alex Proyas) స్పందించాడు.

ఈ మూవీలో హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ (Will Smith) హీరోగా హ్యూమనాయిడ్ రోబోట్‌లకు వ్యతిరేకంగా పోరాడే డిటెక్టివ్‌గా నటించాడు. 2004లో వ‌చ్చిన ఈ ఐ రోబోట్ (I Robot) సినిమా నాటి ప్ర‌జ‌లకు విజువ‌ల్ వండ‌ర్‌గా ఉండ‌డ‌మే కాక‌ భారీ వ‌సూళ్లు సాధించి పెద్ద హిట్‌గా నిలిచింది. అయితే తన సినిమాలోని రోబోట్‌ల మాదిరిగానే ఎలాన్ మస్క్ విడుద‌ల చేసిన‌ కొత్త రోబోలు ఉన్నాయని, డిజైన్‌లు కాపీ చేయబడ్డాయని ఆరోప‌ణ‌లు చేశారు.

GZs-wWtW8AYgNXa.jpeg

ఇదిలాఉండ‌గా.. మ‌స్క్ తాజాగా రిలీజ్ చేసిన వాటిలో రోబోలు మాత్రమే కాకుండా, సైబర్‌క్యాబ్ , రోబోవాన్ కూడా ఉండ‌గా అవి ఐ. రోబోట్ సినిమాలోని వాహనాలను పోలి ఉండ‌డం విశేషం. అలాగే మస్క్ ఈవెంట్‌కు సైతం వియ్, రోబోట్' అని పేరు పెట్టాడు. సోషల్ మీడియాలో సదరు సినిమా విజువల్స్ తో పాటు.. మస్క్ ఈవెంట్ విజువల్స్ ను పోల్చి చూపుతున్న ఫోటోలు షేర్ అవుతున్నాయి.

Updated Date - Oct 16 , 2024 | 06:36 PM