Christian oliver:సాంకేతిక లోపంతో కరేబియన్ సముద్రంలో కూలి..

ABN , Publish Date - Jan 06 , 2024 | 11:38 AM

హాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ హీరో, జర్మన్‌ సంతతికి క్రిస్టియన్‌ ఒలివర్‌ (Christian Oliver) విమాన ప్రమాదంలో మరణించారు. ఒలివర్‌ సహా అతడి ఇద్దరు కుమార్తెలు పైలట్‌ ఈ ప్రమాదంలో కూడా మృతి చెందారు.

Christian oliver:సాంకేతిక  లోపంతో కరేబియన్ సముద్రంలో కూలి..


హాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ హీరో, జర్మన్‌ సంతతికి క్రిస్టియన్‌ ఒలివర్‌ (Christian Oliver) విమాన ప్రమాదంలో మరణించారు. ఒలివర్‌ సహా అతడి ఇద్దరు కుమార్తెలు పైలట్‌ ఈ ప్రమాదంలో కూడా మృతి చెందారు. సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది మత్స్య కారులతో కలిసి మృతదేహాలను బయటికి తీశారు. కిస్టియన్‌ ఒలివర్‌ (Christian Oliver is no more) వెకేషన్‌కు వెళుతుండగా ఈ విమాన ప్రమాదం సంభవించింది. వెకేషనలో భాగంగా గురువారం క్రిస్టియన్‌ ఒలివర్‌ (51) తన కుటుంబంతో కలిసి గ్రెనడైన్స్‌లోని బెక్వియా ద్వీపం విమానాశ్రయం నుంచి సెయింట్‌ లూసియాకు వెళ్తున్నారు. బెక్వియాలో టేక్‌ఆఫ్‌ అయిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో విమానం కరీబియన్‌ సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒలివర్‌ (51), అతని కుమార్తెలు అన్నీక్‌ (10) మడితా క్లెప్సర్‌ (12) మరియు విమానం పెలట్‌ రాబర్ట్‌ సాక్స్‌ మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది మత్స్య కారుల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. పడవ ద్వారా స్థ్థానిక మార్చురీకి మృత దేహాలను తరలించారు. వీరి మరణానికి కారణాలు గుర్తించడానికి శవ పరీక్షలు శుక్రవారం జరిగాయి. అవి ఇంకా బయటికి రావాల్సి ఉంది. (Christian Oliver died)

‘ది గుడ్‌ జర్మన్‌’ (the good german) అనే సినిమాతో ఒలివర్‌ వెండితెరకు పరిచయమయ్యారు. 2008లో యాక్షన్‌-కామెడీ చిత్రం ‘స్పీడ్‌ రేసర్‌’లో నటించారు. కెరీర్‌ ప్రారంభంలో టీవీ షోలు చేసిన చేసిన ఒలివర్‌.. ఇప్పటివరకు 60కి పైగా సినిమాల్లో నటించారు. 30 ఏళ్ల కెరీర్‌లో టామ్‌ క్రూజ్‌ మరియు జార్జ్‌ క్లూన్లీలతో కలిసి సినిమాల్లో నటించారు. ఇటీవలే ఆయన ‘ఫరెవర్‌ హోల్డ్‌ యువర్‌ పీస్‌’ సినిమా షూటింగ్‌ పూర్తిచేశారు. 

Updated Date - Jan 06 , 2024 | 12:02 PM