Priyanka Chopra: హాలీవుడ్ సినిమా సెట్‌లో ప్రమాదం.. ప్రియాంకకు గాయాలు
ABN , Publish Date - Jun 19 , 2024 | 06:40 PM
అస్ట్రేలియాలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్‌లో ప్రముఖ బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గాయ పడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
అస్ట్రేలియాలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్‌లో ప్రముఖ బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తీవ్రంగా గాయ పడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. గత సంవత్సరం లవ్ ఎగైన్ (Love Again) అనే రొమాంటిక్ చిత్రంలో కనిపించిన ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) ప్రస్తుతం ది బ్లప్ (The Bluff), హెడ్స్ ఆఫ్ స్టేట్ (Heads of State) అనే రెండు హాలీవుడ్ చిత్రాలలో కార్ల్ అర్బన్ ( Karl Urban), ఇద్రీస్ ఎల్బా (Idris Elba), జాన్ సీనా (John Cena) వంటి స్టార్ హాలీవుడ్ హీరోల సరసన నటిస్తోంది.
తాజాగా ది బ్లప్ అనే హాలీవుడ్ చిత్రం షూటింగ్ అస్ట్రేలియాలో జరుగుతుండగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈక్రమంలోనే ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గొంతు వద్ద గాయాలయ్యాయి.
ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రియాంక తన ఇన్‌స్టాలో ప్రోఫెషనల్ లైఫ్‌లో సవాళ్లు.. బ్లఫ్, స్టంట్స్ అంటూ పోస్టు చేసింది. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే షూటింగ్‌ను నిలిపి వేసి ప్రియాంకను సిడ్నీకి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రియాంక (Priyanka Chopra) ఆరోగ్యంగానే ఉన్నారని రెండు మూడు రోజుల్లో తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలిసింది.