Oscar 2024: బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఏదంటే!
ABN , Publish Date - Mar 11 , 2024 | 10:15 AM
96వ ఆస్కార్ (Oscar 2024) వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో డాల్బీ థియేటర్ దీనికి వేదికైంది. 'ఓపెన్ హైమర్’ (Oppenheimer) చిత్రానికి అవార్డుల పంట పండింది. వివిధ కేటగిరీల్లో ఈ చిత్రానికి ఏడు అవార్డులు వరించాయి.
96వ ఆస్కార్ (Oscar 2024) వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో డాల్బీ థియేటర్ దీనికి వేదికైంది. 'ఓపెన్ హైమర్’ (Oppenheimer) చిత్రానికి అవార్డుల పంట పండింది. వివిధ కేటగిరీల్లో ఈ చిత్రానికి ఏడు అవార్డులు వరించాయి. ఇప్పుడు అందరూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఏ పాటకు అవార్డు దక్కుతుందని ఆతురతగా ఎదురుచూస్తున్నారు. గతేడాది భారతీయ చిత్రం, అందులోనూ తెలుగు చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఉత్తమ ఒరిజినల్ విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR)సినిమాలోని నాటునాటు’ (naatu naatu) పాటకు అవార్డు వరించింది. భారతీయ చిత్రానికి ఆస్కార్ రావడంతో దాంతో కోట్లాది మంది భారతీయుల కల నెరవేరినట్టైంది.
అయితే ఈసారి భారతీయ చిత్రాలేవి ఆస్కార్ బరిలో లేవు. కానీ గతేడాది ‘ఆర్‌ఆర్‌ఆర్’ గెలుచుకున్న విభాగంలో ఈసారి ఏ పాటకు పురస్కారం దక్కుతుందా అని ఆతురతగా ఎదురుచూశారు సినీ ప్రియులు. ‘ఓపెన్ హైమర్’ సినిమాతో పోటీపడి బాక్సాఫీస్ దగ్గర వేలకోట్ల వసూళ్లు రాబట్టిన ‘బార్బీ’ సినిమాలోని ‘వాట్ వజ్ ఐ మేడ్ ఫర్’ పాటకు ఈసారి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగీరీలో అవార్డ్ వచ్చింది. బిల్లీ ఏలిష్ పాడిన పాట ఇది. మార్క్ ర్యాన్సన్. ఆండ్రూ వైట్ సంగీతం అందించారు. ‘నాటు నాటు’తో పోలిస్తే డిఫరెంట్ సాంగ్ ఇది. భావోద్వేగంగా సాగే అద్భుతమైన మెలోడీగా తీర్చిదిద్దారు. ఆ పాటకు అవార్డు రావడం పట్ల చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది.
ఇప్పటికే ఈ చిత్ర సంగీతానికి పలు అవార్డులు వరించాయి. బెస్ట్ సౌండ్ ట్రాక్ విభాగంలో హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డు, టాప్ సౌండ్ ట్రాక్ కేటగిరీలో బిల్‌బోర్డ్ మ్యూజిక్ అవార్డు, బెస్ట్ సౌండ్ ట్రాక్ విభాగంలో ఎస్‌టి. లూయిస్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు, బెస్ట్ కంపైలేషన్ సౌండ్ ట్రాక్ ఫర్ విజువల్ మీడియా విభాగంలో గ్రామీ పురస్కారాలు అందుకొందీ చిత్రం.