Avatar 3: పండోర  గ్రహానికి మూడోసారి.. కామెరూన్‌ అదిరే అప్‌డేట్‌!

ABN , Publish Date - Aug 10 , 2024 | 02:12 PM

హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ జేమ్స్‌ కామెరూన్‌ (James Cameron) ‘అవతార్‌-3’ (Avatar 3) అప్‌డేట్‌ ఇచ్చారు. ఇప్పటికే ఈ చిత్రం రెండు పార్టులుగా విడుదలై అత్యధిక ప్రేక్షకాదరణను పొంది రూ.కోట్లు వసూలు చేశాయి.


హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ జేమ్స్‌ కామెరూన్‌ (James Cameron) ‘అవతార్‌-3’ (Avatar 3) అప్‌డేట్‌ ఇచ్చారు. ఇప్పటికే ఈ చిత్రం రెండు పార్టులుగా విడుదలై అత్యధిక ప్రేక్షకాదరణను పొంది రూ.కోట్లు వసూలు చేశాయి. దీనికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ ఇచ్చారు. మూడో భాగం టైటిల్‌ను, విడుదల తేదీని వెల్లడించారు. ‘అవతార్‌- ఫైర్‌ అండ్‌ యాష్‌’ (Avatar: Fire And Ash) పేరుతో దీన్ని తెరకెక్కించనున్నట్లు తెలిపారు. మరోసారి పండోర గ్రహానికి వెళ్లడానికి సిద్థంగా ఉండండి’’ అని సోషల్‌ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

  Untitled-1.jpg
హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన ఓ అద్బుత ప్రపంచమిది. పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్లు చెదిరే విజువల్‌ ఎఫెక్ట్స్‌తో అందరినీ కట్టిపడేశారు. ప్రపంచ చిత్ర పరిశ్రమలో ‘అవతార్‌’ ఓ సంచలనం. ఆ తర్వాత ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’తో మంచి సర్‌ప్రైజ్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదలైన ఆ సీక్వెల్‌ బాక్సాఫీసు కలెక్షన్లను కొల్లగొట్టింది. ఆ ఫ్రాంచైజీలో రానున్న మూడో భాగాన్ని పంచభూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్‌తో రూపొందించనున్నారు.
 James.jpg
దర్శకుడు మాట్లాడుతూ "ఈసారి సినిమాలో పాత్రలపై ఎక్కువ దృష్టి సారిస్తాము. మంచి కథనంతో భారీ విజువల్స్‌తో అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మీ అంచనాలకు మించిన లైవ్‌-యాక్షన్‌ని ఇందులో చూస్తారు మరో కొత్త ప్రపంచాన్ని భిన్నమైన కథనం, విభిన్నమైన పాత్రలు ఇందులో కనిపిస్తాయి. ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’లో కనిపించిన కేట్‌ విన్స్‌లెట్‌ చేసిన రోనాల్‌ క్యారెక్టర్‌ను అవతార్‌ 3లో మరింత పొడిగించాము. అందుకోసం ఆమె చాలా కష్టపడి శిక్షణ తీసుకుంటుంది’ అని అన్నారు. అవతార్‌ ఫ్రాంచైజీలో రానున్న ‘అవతార్‌ 4’ 2029లో, చివరిగా రానున్న ‘అవతార్‌ 5’ డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో తెలిపింది.

Updated Date - Aug 10 , 2024 | 02:14 PM