Gladiator II: 24 ఏండ్ల త‌ర్వాత హాలీవుడ్ సినిమా సీక్వెల్‌.. ట్రైల‌ర్ విడుద‌ల‌

ABN , Publish Date - Jul 10 , 2024 | 07:26 AM

దాదాపు 24 సంవ‌త్స‌రాల క్రితం విడుద‌లైన ఓ హాలీవుడ్ ఎవ‌ర్‌గ్రీన్ క్లాసిక్‌ గ్లాడియేట‌ర్ సినిమాకు సీక్వెల్ రూపొంది విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. తాజాగా ఈ చిత్రం గ్లాడియేట‌ర్ 2 ట్రైల‌ర్ విడుద‌లై అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

Gladiator2

దాదాపు 24 సంవ‌త్స‌రాల క్రితం విడుద‌లైన ఓ హాలీవుడ్ ఎవ‌ర్‌గ్రీన్ క్లాసిక్‌ గ్లాడియేట‌ర్ సినిమాకు సీక్వెల్ గ్లాడియేట‌ర్ 2 (Gladiator II) రూపొంది విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. 2020 మే1 విడుద‌లైన గ్లాడియేట‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించ‌డంతో పాటు 5 విభాగాల్లో అస్కార్ అవార్డులు ద‌క్కించుకుంది. మొద‌టి చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రిడ్లీ స్కాట్ (Ridley Scott) ఈ మూవీని డైరెక్ట్ చేశారు.

Gladiator2

పాల్ మాస్క‌ల్ (Paul Mescal) హీరోగా న‌టించిన ఈ సినిమాలో పెడ్రో పాస్క‌ల్ (Pedro Pascal), కొన్ని నీల్స‌న్ (Connie Nielsen), డెంజ‌ల్ వాషింగ్ట‌న్ (Denzel Washington), మేక్లామ్‌వే (May Calamawy) ప్రధాన పాత్ర‌ల్లో న‌టించారు. తాజాగా ఈ చిత్రం గ్లాడియేట‌ర్ 2 (Gladiator II) ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా న‌వంబ‌ర్ 15న విశ్వ వ్యాప్తంగా హాలీవుడ్‌తో పాటు తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయనున్నారు.


Gladiator2

ఈ గ్లాడియేట‌ర్ 2 (Gladiator II) సినిమాను మొద‌టి భాగం త‌ర‌హా క‌థ‌తోనే తెర‌కెక్కించ‌గా.. ఆ చిత్రాన్ని మ‌రిపించే విజువ‌ల్స్‌, స్టోరీ, పోరాట ఘ‌ట్టాల‌తో మూవీని రూపొందించిన‌ట్టు ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. మ‌రి ఈ సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చి ఎన్ని, ఎలాంటి రికార్డులు తిర‌గ‌రాస్తుందో వేచి చూడాలి.

Gladiator2

Updated Date - Jul 10 , 2024 | 07:26 AM