Oscars 2024: 96వ ఆస్కార్ వేడుకలు ఎక్కడ చూడొచ్చంటే..
ABN , Publish Date - Mar 10 , 2024 | 10:47 AM
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న 96వ ఆస్కార్ (Oscars 2024) అవార్డుల వేడుకలకు సర్వం సిద్ధమయ్యింది. మార్చి 11 న తెల్లవారుజాము నుంచి (96 oscars awards) ఈ అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది.
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న 96వ ఆస్కార్ (Oscars 2024) అవార్డుల వేడుకలకు సర్వం సిద్ధమయ్యింది. మార్చి 11 న తెల్లవారుజాము నుంచి (96 oscars awards) ఈ అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో న డాల్బి థియేటర్‌లో ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి. నాలుగోసారి జిమ్మీ కిమ్మెల్ ఆస్కార్ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేస్తున్నారు. హాలీవుడ్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ఈ ఈవెంట్‌కు హాజరు కానున్నారు. ఇప్పటికే క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన ‘ఓపెన్‌హైమర్’పైనే ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా ఉంది. మొత్తం 13 కేటగిరిల్లో ఈ సినిమా పోటీపడుతోంది. దీంతో పాటు ‘బార్బీ’, ‘పూర్ థింగ్స్’, ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’కు కూడా పలు అవార్డులు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హాలీవుడ్ తో పాటు, భారతీయ సినీ అభిమానులు సైతం ఆస్కార్ వేడుకను వీక్షించాలని ఉత్సాహపడుతున్నారు. అమెరికాలో ఆదివారం రాత్రి ఆస్కార్స్ వేడుక జరనుంది. మన కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజాము నుంచి ఈ వేడుకను చూడగలము. ఉదయం 4 గంటల నుండే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ అవార్డ్ ఈవెంట్ స్ట్రీమ్ కానుంది. స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ హెచ్‌డీ, స్టార్ వరల్డ్‌లో కూడా ఈ అవార్డ్ వేడుకలను వీక్షించవచ్చు..