Ram Charan Upasana: రామ్ చరణ్, ఉపాసనల ఆస్తి ఎంతో తెలిస్తే షాకవుతారు
ABN , Publish Date - Mar 27 , 2024 | 04:57 PM
రామ్ చరణ్, ఉపాసన జంట దక్షిణ భారతదేశంలో అత్యంత పవర్ ఫుల్ జంటతో పాటు, సంపన్నమైన జంట కూడాను. వీరిద్దరి ఆస్తి వివరాలు ఒక్కసారి చూద్దాం
రామ్ చరణ్, ఉపాసన కొణిదెల జంట దక్షిణ భారతదేశంలో ఒక పవర్ ఫుల్ జంట అని చెప్పొచ్చు. ఒక్క సినిమా పరిశ్రమలోనే కాకుండా ఈ ఇద్దరి జంట అన్ని రంగాల్లో బెస్ట్ గా వుంటున్నారు అని అనుకుంటున్నారు. రామ్ చరణ్, ఉపాసన జంట చాలామందికి రోల్ మోడల్స్ గా నిలుస్తున్నారని కూడా అంటున్నారు.
అయితే రామ్ చరణ్ అటు నటుడిగా, ఉపాసన ఇటు వ్యాపారవేత్తగా ఇద్దరికీ బాగానే రాబడి వస్తోందని వినికిడి. ఈ ఇద్దరికీ కలిపి మొత్తం ఆస్తివిలువ ఎంత ఉంటుందో తెలిస్తే షాకవుతారు. ఈ ఇద్దరికీ కలిపి సుమారు రూ. 2,500 కోట్లకి పైగా ఆస్తి ఉంటుంది అని అంచనా. 'ఆర్ఆర్ఆర్' సినిమా తరువాత రామ్ చరణ్ పేరు ఒక్కసారిగా ప్రపంచం అంతా వినపడింది. ఆస్కార్ అవార్డులు కూడా గెలుగుచుకున్న ఈ సినిమాతో రామ్ చరణ్ స్థాయి బాగా పెరిగింది అని చెప్పొచ్చు.
ఈ మొత్తం ఆస్తిలో చరణ్ ఆస్తి రూ.1370 కోట్లు కాగా, ఉపాసన ఆస్తి రూ.1130 కోట్లు అని అంచనా వేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాకి రామ్ చరణ్ పారితోషికం రూ.45 కోట్లు తీసుకున్నారు అని, అయితే ఆ తరువాత వస్తున్న 'గేమ్ చెంజర్' సినిమాకి పారితోషికం రూ.100 కోట్లు తీసుకున్నారని భోగట్టా.
ఇక ఉపాసన విషయానికి వస్తే, ఆమె దేశంలో వున్న అతి పెద్ద ఆసుపత్రుల్లో ఒకటిగా పేరొందిన అపోలో ఆసుపత్రిలో భాగస్వామి. ఆ ఆసుపత్రి విలువ మార్కెట్ లో వున్న అంచనా ప్రకరాం సుమారు రూ.77,000 కోట్లు ఉంటుందని అంటున్నారు. అలాగే వీరిద్దరూ హైదరాబాదులోని 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకొని వుంటున్నారు. ఆ ఇల్లు విలువ సుమారు రూ.30 కోట్లు ఉంటుందని అంచనా.
అవన్నీ ఒక పక్క అలా ఉంచితే, రామ్ చరణ్ కి ఒక ప్రైవేట్ జెట్ కూడా వుంది అని అంటారు. అతను ఎక్కడికి వెళ్లాలన్నా ఆ ప్రైవేట్ జెట్ లోనే వెళతారు అని కూడా అంటారు. అలాగే రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కూడా అప్పుడప్పుడు ఆ జెట్ వాడుతూ ఉంటారని కూడా చెపుతారు.
ఒక ప్రైవేట్ జెట్ కాకుండా, రామ్ చరణ్ కి చాలా విలువైన కార్లు కూడా ఉన్నాయని, అతని కార్లు బాగా వాడతారని అంటున్నారు. అందులో రోల్స్ రోయస్ ఫాంటమ్ (Rolls-Royce Phantom) కారు అత్యంత విలువైనదని, ఆ కారు విలువ సుమారు రూ.9.57 కోట్లు ఉంటుందని అంటున్నారు.
ఇక మిగతా కార్లు చూస్తే మెర్సిడెస్ మేబ్యాక్ జిఎల్ఎస్ 600 (Mercedes Maybach GLS 600) కారు విలువ రూ.4 కోట్లు ఉంటుందని, ఇంకొక కారు ఫెర్రాయి పోర్టోఫినో (Ferrari Portofino) విలువ రూ.3.50 కోట్లు, ఆస్టన్ మార్టిన్ వింటేజ్ వి8 (Aston Martin Vantage V8) కారు విలువ రూ.3.2 కోట్లు అని తెలిసింది.