The Goat Review: ది గోట్‌ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్స్‌)

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:40 PM

ఇళయ దళపతి విజయ్‌ హీరోగా నటించిన చిత్రం ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ విజయ్‌ డ్యూయెల్‌ రోల్‌ చేశారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదీ కాకుండా రాజకీయ రంగ ప్రవేశానికి ముందు హీరో విజయ్‌ ఈ చిత్రం రావడం అభిమానుల్లో మరింత క్రేజ్‌ క్రియేట్‌ అయింది.

సినిమా రివ్యూ: ది గోట్‌ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్స్‌- The Goat))
విడుదల తేది: 5–9–2024
నటీనటులు: విజయ్‌, మీనాక్షి చౌదరి, స్నేహా, ప్రశాంత్‌, లైలా, వైభవ్‌, యోగిబాబు, అజ్మల్‌ తదితరులు.


సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్‌,
ఎడిటింగ్‌: వెంకట్‌ రాజన్‌
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
నిర్మాతలు: కల్పతి ఎస్‌. అఘోరం, కల్పతి గణేష్‌, కల్పతి సురేష్‌
రచన–దర్శకత్వం: వెంకట్‌ ప్రభు (Venkat Prabhu)

ఇళయ దళపతి విజయ్‌ (Hero Vijay) హీరోగా నటించిన చిత్రం ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ విజయ్‌ డ్యూయెల్‌ రోల్‌ చేశారు. వెంకట్‌ ప్రభు (Venkat Prabhu)దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదీ కాకుండా రాజకీయ రంగ ప్రవేశానికి ముందు హీరో విజయ్‌ ఈ చిత్రం రావడం అభిమానుల్లో మరింత క్రేజ్‌ క్రియేట్‌ అయింది. ఎ.ఐ టెక్నాలజీ ద్వారా మరో విజయ్‌ పాత్రను సృష్టించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. టైటిల్‌కు తగ్గట్గు సినిమా గ్రేటెస్ట్‌గా ఉందా లేదా? రివ్యూలో చూద్దాం.

కథ: (the greatest of all times Review)
గాంధీ (విజయ్‌- Vijay) స్పెషల్‌ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ బృందంలో పని చేస్తుంటాడు. తన భార్య స్నేహకు తను చేసేది ఏ ఉద్యోగం ఏంటనేది చెప్పడు. ఓ మిషన్‌ కోసం భార్య పిల్లలతో థాయ్‌లాండ్‌ వెళ్లినప్పుడు కొడుకు జీవన్‌ (విజయ్‌)ను కోల్పోతాడు. కుమారుడు మరణించాడని తనకు తాను గాంధీ శిక్ష విధించుకుంటాడు. స్క్వాడ్‌ను వదిలి బయటకు వచ్చేస్తాడు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత మాస్కోలో గాంధీకి జీవన్‌ కనిపిస్తాడు. కొడుకు కనిపించిన సంతోషంలో ఇండియాకు తీసుకొస్తాడు. అంతా సజావుగా ఉందనుకుంటున్న సమయంలో గాంధీ కళ్ల ముందు అతని బాస్‌ నజీర్‌ (జయరామ్‌)ని ఎవరో మర్డర్‌ చేస్తారు. ఆ తర్వాత గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరుగా హత్యకు గురి అవుతారు. ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు? ఇంతకీ మీనన్‌ ఎవరు? తండ్రి గాంధీ మీద కొడుకు జీవన్‌ ఎందుకు పగతో ఉన్నాడు? తదుపరి ఏమైంది అనేది మిగతా కథ.  


Vijay.jpg
విశ్లేషణ..(The greatest of all times Movie review)
దేశ రక్షణ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే ఓ ఏజెంట్‌ కథ ఇది. అనుకోని పరిస్థితుల్లో అతను ఓ మిషన్‌లో తన కొడుకును కోల్పోవలసి రావడం, ఆ కొడుకే 15 ఏళ్ల తర్వాత తన పాలిట శత్రువులా మారడం, అతని ఆట కట్టించేందుకు ఆ తండ్రి ఏం చేశాడన్నది సింపుల్‌ లైన్‌. అయితే ఈ తరహా కథలు దక్షిణాదికి కొత్తేమీ కాదు. కథలో కొత్తదనం లేకపోయినా వెంకట్‌ ప్రభు స్ర్కీన్‌ప్లేలో మాస్టర్‌ కావడంతో ఆసక్తిగా నడిపిస్తాడని ప్రేక్షకులకు నమ్మకం.జనరల్‌గా ఈ తరహా కథలో టర్న్‌, ట్విస్ట్‌లు కనిపిస్తాయి. అయితే దీనిలో అలాంటి ట్విస్ట్‌లు ఏమీ కనిపించలేదు. హీరోకి తన కొడుకు ఎక్కడ తారస పడతాడో.. అక్కడి నుంచే కథలో కాస్త వేగం కనిపించింది. ఈ క్రమంలో తన బిడ్డని మాస్కో విలన్‌ గ్యాంగ్‌ నుంచి రక్షించుకోవడానికి గాంధీ చేసే ఛేజింగ్‌, యాక్షన్‌ సీన్స్‌ అలరిస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు జీవన్‌ పాత్రతో ఇచ్చిన ట్విస్ట్‌ ఆసక్తికరంగా మలిచారు. మెట్రోలో తండ్రీ కొడుకుల మధ్య సాగే యాక్షన్‌ సీన్‌ కూడా హైలైట్‌గా నిలిచింది. ఇంటర్వెల్‌కి ముందే జీవన్‌ విలన్‌ అని తెలియడంతో ద్వితయార్థంలో ఫాదర్‌ అండ్‌ సన్‌ మధ్య వార్‌ ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. సెకెండాఫ్‌ ప్రారంభంలో గాంధీకి, జీవన్‌కు మధ్య నడిచే మైండ్‌ గేమ్‌ ప్రేక్షకుడికి కాస్త ఊరట కలిగిస్తోంది. అయితే తండ్రిపై కొడుకు పగ పెంచుకోవడానికి గల కారణాన్ని అంత ప్రభావంగా చూపించలేదు. అసలు ఏ పాయింట్‌ నచ్చి విజయ్‌ ఈ చిత్రం అంగీకరించారో అని ఇంటర్వెల్‌ ముందుకు వరకూ ప్రేక్షకుడి మదిలో మెదులుతుంది. అప్పటి వరకూ ఎలాంటి కొత్తదనం లేకుండా మూస ధోరణిలో సాగుతుంది. ప్రథమార్థంతో పోలిస్తే.. ద్వితీయార్థం ఫర్వాలేదనిపిస్తుంది. భార్యభర్తల మధ్య సన్నివేశాలు అంతగా రక్తి కట్టించలేదు. కామెడీ కూడా అంతగా ఆకట్టుకోలేదు. సినిమాకు నిడివి చాలా మైనస్‌ అని చెప్పొచ్చు.

ఆర్టిస్ట్‌ల పనితీరుకు వస్తే.. నటన పరంగా విజయ్‌ అభిమానులకు ఈ చిత్రం ఒక ట్రీట్‌ అనవచ్చు. హీరోగానే కాకుండా విలనిజాన్ని విజయ్‌ అద్భుతంగా కనబరిచారు. డ్యూయెల్‌ రోల్‌ ఆకట్టుకుంది. అభిమానులు కోరుకునే మ్యానరిజమ్స్‌, మాస్‌ డైలాగ్‌లు బాగానే ఉన్నాయి. స్నేహకు ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. మీనాక్షి ద్వితీయార్థంలో రెండు సీన్లు, ఓ ఆటకు పరిమితమైపోయింది. విజయ్‌, త్రిష పాట పిక్చరైజేషన్‌ బావుంది. స్క్వాడ్‌ ఏజెంట్స్‌గా జయరామ్‌, ప్రభుదేవా, ప్రశాంత్‌, అజ్మల్‌ పాత్రలలకు న్యాయం చేశారు. క్లైమాక్స్‌లో శివ కార్తికేయన్‌ గెస్ట్‌గా తళుక్కుమన్నారు. యువన్‌ శంకర్‌ రాజా పాటలు, ఆర్‌ఆర్‌ సత్తా చాటలేకపోయాయి. కెమెరా వర్క్‌ బావుంది. డీ ఏజింగ్‌ కాన్సెప్ట్‌ ద్వారా క్రియేట్‌ చేసిన యంగ్‌ విజయ్‌ లుక్‌ బావుంది. పేరు పెట్టేలా ఏమీ లేదు. విజయ్‌ విలనిజం చూపించిన సన్నివేశాలు డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తాయి. నిర్మాణపరంగా సినిమా బావుంది. వెంకట్‌ ప్రభు నుంచి ప్రేక్షకులు ఆశించే కొత్తతరహా అంశాలు ఏమీ లేవు. ఫ్యాన్స్‌ని మాత్రమే టార్గెట్‌ చేసిన సినిమా ఇది. సక్సెస్‌ విజయ్‌ భుజాల మీదే ఆధారపడి ఉంటుంది.

ట్యాగ్‌లైన్‌: ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్స్‌.. విజయ్‌ ఫ్యాన్స్‌ కోసమే!

Updated Date - Sep 05 , 2024 | 04:40 PM