Demonte Colony 2 Review: ‘డిమోంటి కాలనీ 2’ మూవీ రివ్యూ
ABN , Publish Date - Aug 23 , 2024 | 08:13 PM
ఈ మధ్యకాలంలో హారర్ కామెడీ సినిమాలైతే వస్తున్నాయి కానీ.. హారర్ థ్రిల్లర్ సినిమాలు మాత్రం చాలా తక్కువగానే థియేటర్లకి వస్తున్నాయి. హారర్ థ్రిల్లర్ జానర్‌లో 2015లో వచ్చిన తమిళ చిత్రం ‘డిమోంటి కాలనీ’.. అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఆ సినిమాకీ ఇప్పటికీ ఫ్యాన్ బేస్ ఉందంటే.. ‘డిమోంటి కాలనీ’ క్రేజ్ అది. దాదాపు 9 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ సినిమా సీక్వెల్ ఎలా ఉందంటే..
మూవీ పేరు: ‘డిమోంటి కాలనీ 2’
విడుదల తేదీ: 23-08-2024
నటీనటులు: అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్, అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవింద్ రాజన్, సర్జనో ఖాలిద్, అర్చన రవిచంద్రన్ తదితరులు
సంగీతం: సామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ: హరీశ్ కన్నన్
ఎడిటర్: కుమరేష్. డి.
నిర్మాతలు: బి. సురేష్ రెడ్డి, బి. మానస రెడ్డి
రచన, దర్శకత్వం: అజయ్ ఆర్ జ్ఞానముత్తు
ఈ మధ్యకాలంలో హారర్ కామెడీ సినిమాలైతే వస్తున్నాయి కానీ.. హారర్ థ్రిల్లర్ సినిమాలు మాత్రం చాలా తక్కువగానే థియేటర్లకి వస్తున్నాయి. హారర్ థ్రిల్లర్ జానర్‌లో 2015లో వచ్చిన తమిళ చిత్రం ‘డిమోంటి కాలనీ’.. అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఆ సినిమాకీ ఇప్పటికీ ఫ్యాన్ బేస్ ఉందంటే.. ‘డిమోంటి కాలనీ’ క్రేజ్ అది. దాదాపు 9 సంవత్సరాల తర్వాత ‘డిమోంటి కాలనీ’కి సీక్వెల్‌గా ‘డిమోంటి కాలనీ 2’ని ప్లాన్ చేశారంటే ఎంతగా కసరత్తు చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇక తమిళ్‌లో ఆగస్ట్ 15నే విడుదలైన ఈ సినిమా.. వారం గ్యాప్‌తో ఆగస్ట్ 23న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్ ప్రేక్షకులని మెప్పించిన ఈ సినిమా.. తెలుగు ప్రేక్షకులను అలరించిందా? ‘డిమోంటి కాలనీ’ క్రేజ్‌ని నిలబెట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం..
కథ:
క్యాన్సర్ బారిన పడిన భర్త సామ్ రిచర్డ్ (సర్జనో ఖాలిద్)ను, అతని భార్య డెబీ (ప్రియా భవానీ శంకర్) ఎన్నో ప్రయాసలకోర్చి క్యాన్సర్ నుంచి కోలుకునేలా చేస్తుంది. అంతా బాగుందీ అనుకునే సమయంలో సామ్ రిచర్డ్ ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. తన భర్త ఎందుకు చనిపోయాడనేది అంతుబట్టక.. అతని ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తుండి డెబీ. ఈ క్రమంలో తన భర్త చావుకి ఓ బుక్ అని తెలుసుకుంటుంది. ఆ బుక్ ఆరేళ్లకు ఒకసారి కొంతమందిని చంపేస్తుందనే విషయం తెలుసుకున్న డెబీ.. అప్పటికే ఆ బుక్ చదివి ఉన్న కవల సోదరులు శ్రీనివాస్, రఘునందన్ (అరుళ్ నిధి)లను కాపాడాలనుకుంటుంది. ఇందుకోసం ఆమె.. తన మామ రిచర్డ్ (అరుణ్ పాండియన్)తో కలిసి కొన్ని ప్లాన్లు వేస్తుంది. మొదటి పార్ట్ ‘డిమోంటి కాలనీ’కి లింక్ అయ్యేలా అమ్మాయిల గ్రూప్ అదే సమయంలో అక్కడి డిమోంటి హౌస్‌కి వస్తుంది. ఆ గ్రూప్‌కి, మనుషులను చంపేస్తున్న బుక్‌కి ఉన్న సంబంధం ఏమిటి? కవల సోదరులను డెబీ రక్షించగలిగిందా? అసలు డెబీ.. ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకుంది? అనేది తెలియాలంటే మాత్రం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాని చూడాల్సిందే. (Demonte Colony 2 Review)
విశ్లేషణ:
‘డిమోంటి కాలనీ’ ఫస్ట్ పార్ట్ చూసిన వారికి ఈ సినిమా ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా అర్థమవుతుంది కానీ.. ఫస్ట్ టైమ్ చూసేవారికి మాత్రం కాస్త కన్ఫ్యూజ్‌కి గురి చేస్తుంది. సినిమా స్టార్టింగ్‌లో మొదటి పార్ట్‌ను లైట్‌గా టచ్ చేస్తూ.. నేరుగా కథలోకి తీసుకెళ్లారు. ఇక అక్కడి నుంచి వరుస ట్విస్ట్‌లతో.. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ప్రేక్షకులకు ఇవ్వడంలో ఈ సినిమా సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ తరహా చిత్రాలను ఇష్టపడే వారు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. డెబీ కోణంలో మొదలైన ఈ సినిమా.. ఆమె భర్త అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడం, అసలు ఎలా చనిపోయాడో తెలుసుకోవాలని డెబీ అనుకోవడం, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. మరోవైపు కవలలతో కథను కనెక్ట్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుడిని మరింతగా సినిమాలోకి ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. ఇక డిమోంటి హౌస్‌లో ఉన్న అమ్మాయిల బ్యాచ్ సన్నివేశాలు అయితే హైలెట్ అని చెప్పొచ్చు. మొదటి పార్ట్ కంటే కూడా దర్శకుడు ఈ పార్ట్‌లో ఎక్కువ డ్రామాని నడిపారు. అలాగే మొదటి పార్ట్ సక్సెస్.. ఈ పార్ట్‌పై భారీగా ఖర్చు పెట్టేలా చేసిందని ప్రతి ఫ్రేమ్ తెలియజేస్తుంది. క్లైమాక్స్, పార్ట్ 3కి ఇచ్చిన లీడ్ కూడా చాలా ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి. అయితే ఈ సినిమా సెకండాఫ్‌లో మాత్రం స్ర్కీన్‌ప్లే కాస్త కన్ఫ్యూజ్‌కి గురి చేస్తుంది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. (Demonte Colony 2 Movie)
నటీనటుల, సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. కవలలుగా ఇందులో అరుళ్ నిధి అభినయం అలరిస్తుంది. ఇద్దరుగా అరుళ్ నిధి చూపించిన వేరియేషన్స్ ఎంత అలరిస్తాయో.. కొన్ని సన్నివేశాల్లో అంత భయపెడతాయి. డెబీ పాత్రలో ప్రియా భవానీ శంకర్ అతికినట్లుగా సరిపోయింది. ఎప్పుడూ గ్లామర్‌గా కనిపించే ప్రియా.. ఇందులో మాత్రం కాస్త ఢిపరెంట్‌గా కనిపిస్తుంది. ఆమె పాత్ర అలాంటిది. అరుణ్ పాండియన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. మిగతా వారంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ప్రతి ఒక్కరి పనితనం హైలెట్ అనేలా ఉంది. ఒక్క గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే.. ఈ హారర్ థ్రిల్లర్ రేంజే వేరుగా ఉండేది. ఓవరాల్‌గా మాత్రం హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారిని మాత్రం బాగా ఎంటర్‌టైన్ చేసి పంపుతుందీ చిత్రం.
ట్యాగ్‌లైన్: హారర్ థ్రిల్లర్ ప్రియులకు పండగే!