Brinda OTT: ‘బృంద’ ఇది మాములు థ్రిల్లర్ వెబ్ సిరీస్ కాదు బయ్యో.. అసలు వదలకండి
ABN , Publish Date - Aug 08 , 2024 | 03:02 PM
గత వారం ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘బృంద’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలుగులోనూ ఇలాంటి సిరీస్ ఉందా అనే విధంగా వీక్షకులను అశ్చర్య పరుస్తోంది.
గత వారం ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘బృంద’ (Brinda)ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలుగులోనూ ఇలాంటి సిరీస్ ఉందా అనే విధంగా వీక్షకులను అశ్చర్య పరుస్తోంది. గతంలో బాలీవుడ్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ సిరీస్ అసుర్‌ను మైమరిపిస్తూ చూస్తున్నంత సేపు ఆసక్తితో పాటు, ఉత్కంఠ రేకెత్తిస్తూ బాగా థ్రిల్ చేస్తోంది. సూర్య మనోజ్ వంగాల (Surya Manoj Vangala) గ్రిప్పింగ్‌గా రాసి, డైరెక్ట్ చేసిన ఈ తెలుగు సిరీస్‌తో త్రిష (Trisha Krishnan) ఫస్ట్ టైం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడం గమనార్హం.
కథ విషయానికి వస్తే.. నగరంలో పలుచోట్ల ఒకే తరహాలో వింతగా హత్యలు జరుగుతుంటాయి. ఆపై కొద్ది రోజుల తర్వాత చెరువుల్లో, కాలువల్లో మృతదేహాలు దొరుకుతుంటాయి. దీంతో సమీపంలోని స్టేషన్‌లో ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న బృంద ఈ కేసు పరిశోధన మొదలు పెడుతుంది. ఈ నేపథ్యంలో చాలా రహాస్యాలు బయట పడతాయి. అప్పటికే ఇలాంటి హత్యలు 10కి పైగానే జరిగాయని తేల్చి నిందుతుడిని గుర్తించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది.
చివరకు అతనని పట్టుకునే సమయానికి అసలు హంతకుడు కొందరినే చంపలేదని వారి హత్యల మాటున జరిగిన మారణకాండల గురించి తెలిసి షాకవుతారు. అంతేకాక ఈ మర్డర్స్ చేసేది ఒకరు కాదని వీటి వెనకాల మరో మనిషి ఉన్నట్లు గుర్తిస్తారు. చివరకు అసలు సూత్రధారిని బృంద పట్టుకోగలిగిందా, తరచూ తనకు తన బాల్యంలో జరిగిన ఘటనలు ఎందుకు గుర్తుకు వచ్చేవి, ఆ బాల్యానికి, ఈ కథకు లింకేటి, అసలు ఈ హత్యలు ఎందుకు చేశారనే చాలా ఆసక్తికరమైన కథకథనాలతో సిరీస్‌ను రూపొందించారు.
ముఖ్యంగా ఈ సిరీస్‌లో స్టోరీ ఎంత గ్రిప్పింగ్‌గా ఉందో.. హత్యలు చేసే ఠాకూర్ క్యారెక్టర్ హైలెట్‌గా డిజైన్ చేశారు. ఆ పాత్రలో తమిళ స్టేజ్ యాక్టర్ ఆనంద్ సమి (Anand Sami) జీవించేశాడు. తన సింపుల్ యాక్టింగ్‌తో అమాయకుడి పాత్రలో తన నటన, హావాబావాలతో దివంగత లెజెండ్ బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్‌ను గుర్తు చేశాడు. అదేవిధంగా మలయాళ ఆగ్ర నటుడు ఫృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) అన్న ఇంద్రజిత్ సుకుమారన్ (Indrajith Sukumaran), త్రిష, రవీంద్ర విజయ్ (Ravindra Vijay), రాకేందు మౌళి (Rakendu Mouli) గోపరాజు విజయ్ (Goparaju Vijay) పాత్రలు సిరీస్‌కు చాలా బలం చేకూర్చాయి.
మొత్తం 8 ఎపిసోడ్స్‌తో ఆద్యంతం సస్పెన్స్, అనూహ్యమైన మలుపులతో సాగే ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మర్డర్ మిస్టరీలు, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లు ఇష్టపడే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తెలుగు సిరీస్‌ను మిస్ అవకుండా చూసేయండి. ముఖ్యంగా ఇందులో జరిగే మర్డర్ట్స్‌లో ఓ అరుదైన పక్షి భాగమవడం చాలా ఇంట్రెస్టింగ్‌గా, కొత్త అనుభూతిని ఇస్తుంది.