Happy Days: రీ-రిలీజ్‌కు సిద్ధమైన యూత్ ఫుల్ కల్ట్ క్లాసిక్.. ఎప్పుడంటే?
ABN , Publish Date - Mar 26 , 2024 | 10:38 PM
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2007లో విడుదలైన ‘హ్యాపీ డేస్’ యూత్ ఫుల్ కల్ట్ క్లాసిక్‌గా ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల, విమర్శకుల ప్రసంశలతో పాటు అద్భుతమైన కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. యూత్ ఫుల్ చిత్రాలలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ ‘హ్యాపీ డేస్’ సినిమా.. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో 2007లో విడుదలైన ‘హ్యాపీ డేస్’ (Happy Days) యూత్ ఫుల్ కల్ట్ క్లాసిక్ (Youthful Cult Classic)గా ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల, విమర్శకుల ప్రసంశలతో పాటు అద్భుతమైన కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. యూత్ ఫుల్ చిత్రాలలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ ‘హ్యాపీ డేస్’ సినిమా (Happy Days Movie).. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమ్మర్ స్పెషల్ (Summer Special)గా ఏప్రిల్ 12న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు.
గ్లోబల్ సినిమాస్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఏప్రిల్ 12న ఈ సినిమాను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వరుణ్ సందేశ్ (Varun Sandesh), తమన్నా భాటియా (Tamannaah Bhatia), నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) వంటి న్యూ కమ్మర్స్‌తో డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Director Sekhar Kammula) వెండితెరపై అద్భుతమైన మ్యాజిక్ చేశారు. శేఖర్ కమ్ముల ఎక్స్‌ట్రార్డినరీ డైరెక్షన్, నటీనటులు పెర్ఫార్మెన్స్, మిక్కీ జే మేయర్ చార్ట్ బస్టర్ మ్యూజిక్ ప్రేక్షకుల మనుసులో ఈ సినిమాను ఎవర్ గ్రీన్‌గా నిలిపాయి.
శేఖర్ కమ్ముల తన అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని చాలా రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్‌తో నిర్మించారు. విజయ్ సి. కుమార్ డీవోపీగా పని చేసిన ఈ చిత్రానికి మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్‌గా వర్క్ చేశారు. ఈ సినిమా ఇప్పటికీ కొత్తగా ఇండస్ట్రీకి వస్తోన్న ఎందరికో స్ఫూర్తిని ఇస్తుందంటే.. అందులో అతిశయోక్తి లేనే లేదు. యూత్ ఫుల్ కల్ట్ క్లాసిక్‌గా అలరించిన ఈ చిత్రం మరోసారి థియేటర్స్‌లో మెస్మరైజింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు సిద్ధమవుతోంది.. సో.. గెట్ రెడీ. (Happy Days Re Release Date)
ఇవి కూడా చదవండి:
====================
*Vishva Karthikeya: ఈ సినిమాలో పిల్లల్ని ఎలా పెంచకూడదో చూపించాం..
************************
*Prithviraj Sukumaran: ‘సలార్’కు పూర్తి భిన్నమైన పాత్ర చేశా..
********************************
*Manamey: శర్వానంద్ సినిమా ‘మనమే’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..
***********************