వామ్మో.. రూ.పది కోట్లా?
ABN , Publish Date - Aug 07 , 2024 | 01:00 AM
దక్షిణాదిలో కొంతకాలం పాటు అగ్ర నటిగా కొనసాగిన సమంత.. స్టార్ హీరోలకి ఏ మాత్రం తగ్గని రేంజ్‌లో పారితోషికం అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే లేటె్‌స్టగా అందిన సమాచారం మేరకు...
దక్షిణాదిలో కొంతకాలం పాటు అగ్ర నటిగా కొనసాగిన సమంత.. స్టార్ హీరోలకి ఏ మాత్రం తగ్గని రేంజ్‌లో పారితోషికం అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే లేటె్‌స్టగా అందిన సమాచారం మేరకు.. ఆమె తీసుకునే పారితోషికం రూ.పది కోట్లకు చేరిందట. అదీ సినిమాకు కాదండోయ్. ‘హనీ బన్నీ’ అనే స్పై థ్రిల్లర్ వెబ్ సిరీ్‌సకు. ‘సిటాడెల్’ అనే ఆంగ్ల వెబ్ సిరీ్‌సకు భారతీయ వెర్షన్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కోసం రూ.పది కోట్ల రికార్డు పారితోషికం సమంత అందుకున్నారట. వరుణ్‌ధావన్‌తో కలసి నటించిన ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవ్వనుంది. ఇంతకు ముందు కూడా ఓ ప్రాజెక్ట్ కోసం ఒక బాలీవుడ్ ప్రొడ్యూసర్ భారీ మొత్తం సమంతకు ఆఫర్ చేయగా.. ఆమె తిరస్కరించారని టాక్. ఆ ప్రొడ్యూసర్ సమంతకు భారీ పారితోషికంతో పాటు లాభాల్లో 25 శాతం వాటా కూడా ఆఫర్ చేశారట. సమంత ఆ చిత్రాన్ని అంగీకరించి ఉంటే అది ప్రస్తుతం ఆమె ఈ సిరీస్ కోసం తీసుకున్న రూ.పది కోట్ల కంటే ఎక్కువే అయ్యేది.