మహిళలు సమాజ నిర్మాతలు
ABN , Publish Date - Dec 01 , 2024 | 06:27 AM
‘మహిళలు సమాజ నిర్మాతలు అనే నిజాన్ని మనమంతా గుర్తుంచుకోవాలి’ అని తెలంగాణ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ‘నారి’ చిత్రం...
‘మహిళలు సమాజ నిర్మాతలు అనే నిజాన్ని మనమంతా గుర్తుంచుకోవాలి’ అని తెలంగాణ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ‘నారి’ చిత్రం టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌ని మంత్రి సీతక్క రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘నారి’ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి. మహిళా సమస్యలపై మరిన్ని సినిమాలు చేయాలి’ అని అన్నారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 25న విడుదల చేస్తున్నామని దర్శకనిర్మాతలు సూర్య వంటిపల్లి, శశి చెప్పారు.